Yuzvendra Chahal: గత కొన్ని రోజులుగా టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకుల వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ జంట త్వరలో విడాకులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే, వీరు ఇప్పటి వరకు ఈ వార్తలపై అధికారికంగా స్పందించలేదు. విడాకుల అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుండగానే, చాహల్ తాగి మత్తులో మీడియాకు చిక్కిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో చాహల్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోలో చాహల్ మత్తులో తూలుతూ సరిగా స్పృహలో లేకుండా మద్యం తాగినట్లుగా, ఓ వ్యక్తి సాయంతో పబ్ నుంచి బయటకు వస్తూ కనిపించాడు. ఈ దృశ్యాలు అభిమానుల్లో ఆశ్చర్యాన్ని కలిగించాయి. చాహల్‌ను ఇలా చూడడం చాలా మందికి బాధ కలిగించింది.
Also Read: Sankranthiki Vasthunam Trailer: ఇంట్లో ఇల్లాలు పోలీస్ స్టేషన్లో ప్రియురాలు.. వెంకటేష్ హిట్ ఫార్ములా!
చాహల్, ధనశ్రీ గతంలో ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడంతో పాటు, చాహల్ తన భార్యతో ఉన్న ఫోటోలను తొలగించారు. ఈ చర్యలు విడాకుల వార్తలకు మరింత బలం చేకూర్చాయి. 2020 డిసెంబర్‌లో వివాహం చేసుకున్న చాహల్, ధనశ్రీ, తమ మధుర క్షణాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అప్పట్లో చాలా హ్యాపీ జంటగా కనిపించిన వీరి బంధం ఇప్పుడు ముగిసిపోనుంది. త్వరలో వీరి విడాకుల ప్రకటన అధికారికంగా వెలువడే అవకాశాలున్నాయి. భారత క్రికెటర్ల జీవితంలో వివాహ బంధం సమస్యల కారణంగా మనోవేదనకు గురైన వారు కొందరున్నారు. హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ వంటి క్రికెటర్లు గతంలో ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో చాహల్ కూడా చేరబోతున్నట్లు కనిపిస్తోంది. మొత్తం మీద చాహల్ జీవితంలో వ్యక్తిగత సమస్యలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అభిమానులు ఈ జంట త్వరగా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నారు.
आराम से चहल भाई , टीम को आपकी जरूरत है !! pic.twitter.com/1Vx6Q70mVo
— Byomkesh (@byomkesbakshy) April 29, 2023