NTV Telugu Site icon

Yuzvendra Chahal Batting Order: బ్యాటింగ్‌ ఆర్డర్‌పై చహల్ అయోమయం.. నవ్వులు పూయిస్తున్న వీడియో!

Yuzvendra Chahal Batting Order

Yuzvendra Chahal Batting Order

India call Yuzvendra Chahal back after he walks out to bat: ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో గురువారం వెస్టిండీస్‌, భారత్‌ జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. భారత మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ తన బ్యాటింగ్‌ ఆర్డర్‌పై అయోమయంకు గురయ్యాడు. మైదానంలోకి వచ్చి.. బయటికి వెళ్లి మళ్లీ మైదానంలోకి వచ్చాడు. ఈ ఘటన భారత్‌ లక్ష్య ఛేదన సమయంలో చివరి ఓవర్లో జరిగింది. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భారత్ విజయానికి చివరి ఓవర్‌లో 10 పరుగులు అవసరం అయ్యాయి. వెస్టిండీస్‌ పేసర్ రొమారియో షెఫెర్డ్‌ వేసిన తొలి బంతికి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ బౌల్డ్‌ అయ్యాడు. దాంతో ఎనిమిదో వికెట్‌ రూపంలో కుల్దీప్ పెవిలియన్‌కు చేరాడు. దీంతో టీమిండియా విజయ సమీకరణం 5 బంతుల్లో 10 పరుగులుగా మారింది. కుల్దీప్ ఔట్‌ కావడంతో బ్యాటింగ్ చేసేందుకు యుజ్వేంద్ర చహల్‌ మైదానంలోకి వచ్చాడు. అయితే కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, హెడ్ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మాత్రం చహల్‌కు బదులు పేసర్ ముకేశ్‌ కుమార్‌ను పంపించాలనుకున్నారు. ఈ విషయాన్ని మైదానంలోకి డ్రింక్స్ తీసుకెళ్లిన ఉమ్రాన్‌ మాలిక్‌ ద్వారా చహల్‌కు చెప్పారు.

ఉమ్రాన్‌ మాలిక్‌ విషయం చెప్పిన వెంటనే యుజ్వేంద్ర చహల్‌ తిరిగి డగౌట్‌ వైపు బౌండరీ దాటేశాడు. అయితే అంపైర్లు చహల్‌ను మైదానంలోకి రావాలని పిలిచారు. ఒక్కసారి మైదానంలోకి వచ్చాక.. బయటికి వెళ్లడం రూల్స్‌కు విరుద్దమని చెప్పి చహల్‌ను క్రీజ్‌లోకి పంపించారు. మరో ఎండ్‌లో ఉన్న అర్ష్‌దీప్‌ సింగ్ ఔట్‌ కావడంతో ముకేశ్‌ కుమార్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ముకేశ్ ఒక బంతి ఎదుర్కొని ఒక మాత్రమే చేశాడు. చాల్‌ కూడా ఒక బంతికి 1 పరుగు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. బ్యాటింగ్‌ ఆర్డర్‌పైన అయోమయానికి గురికావడం ఏంటని నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Tilak Varma Sixes: తొలి 3 బంతుల్లో 2 సిక్స్‌లు.. హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ అరంగేట్రమే అదుర్స్‌!

Show comments