Abhishek Sharma: 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, భారత క్రికెట్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్ తన శిష్యుడు అభిషేక్ శర్మ కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. యువరాజ్ సింగ్ శిక్షణలో శిబిరాలు ఏర్పాటు చేయడం ద్వారా తన బ్యాటింగ్ టెక్నిక్‌ను ఎలా మెరుగుపరుచుకున్నాడో అభిషేక్ శర్మ ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్’ కార్యక్రమంలో వెల్లడించారు. లాక్‌డౌన్ సమయంలో యువరాజ్ శిక్షణ అభిషేక్‌కు ఎంతగానో ఉపయోగపడిందని అందులో చెప్పుకొచ్చారు. ఆ సమయంలోనే యువరాజ్, అభిషేక్ త్వరలోనే భారత జట్టుకు మ్యాచ్‌లు గెలిపిస్తాడని జోస్యం చెప్పాడని, అది చరిత్రగా మారిందని 25 ఏళ్ల అభిషేక్ తెలిపారు. ఇటీవల భారత్ ఆసియా కప్ గెలుచుకున్నప్పుడు అభిషేక్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచాడు. ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లలో 314 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
Tollywood Actress : ఆ ఇద్దరి భామల ముద్దుల కోరికను ఆ హీరో నెరవేరుస్తాడా?
ఈ కార్యక్రమంలో అభిషేక్ మాట్లాడుతూ.. నేను చాలా కృతజ్ఞుడను, లాక్‌డౌన్ సమయంలో మేము ఆయన ఇంట్లో క్యాంపులు నిర్వహించేవాళ్లం. నేను, శుభ్‌మన్ గిల్, ప్రభ్‌సిమ్రాన్, అన్‌మోల్‌ప్రీత్ ఉండేవాళ్లం. నిజాయితీగా చెప్పాలంటే, అప్పుడు నాకు అది చాలా అవసరమైంది. మేము విమానంలో వెళ్తుండగా, కొన్ని రోజుల పాటు క్యాంప్ ఏర్పాటు చేయగలమా అని అడిగాను. ఆయన వెంటనే అంగీకరించారు. ఆ సమయంలో నేను కొద్దిగా ఇబ్బంది పడ్డాను అని పేర్కొన్నారు. తాను ఐపీఎల్ జట్టులో స్థానం దక్కించుకోవడానికి కష్టపడుతున్న సమయంలో తన తోటి ఆటగాడైన శుభ్‌మన్ గిల్ వంటివారు ఇప్పటికే భారత జట్టులో ఆడడం ప్రారంభించారని అభిషేక్ గుర్తు చేసుకున్నారు. అలాగే నేను ఐపీఎల్‌లో నిలకడగా లేను, ప్లేయింగ్ ఎలెవన్‌లో కూడా లేను. శుభ్‌మన్ అప్పటికే భారత జట్టులో ఆడుతున్నాడు. నా వయసు వాళ్ళు బాగా రాణిస్తుండడంతో నేను వెనుకబడిపోతున్నానని అనిపించిందని అభిషేక్ అన్నారు.
Devaragattu: దేవరగట్టు బన్నీ ఉత్సవంలో ఆగని హింస.. ఇద్దరు మృతి, 78 మందికి గాయాలు
ఒకరోజు తాము యువరాజ్ ఇంట్లో మధ్యాహ్న భోజనం చేస్తుండగా.. రాష్ట్ర జట్టుకో, ఐపీఎల్‌కో, లేదా భారత్ జట్టులో స్థానం కోసమో నేను నిన్ను సిద్ధం చేయడం లేదు. భారత జట్టుకు నువ్వు మ్యాచ్‌లు గెలిపించడానికి నేను నిన్ను సిద్ధం చేస్తున్నాను. రాసి పెట్టుకో, ఇది రెండు లేదా మూడేళ్లలో జరుగుతుందని యువరాజ్ అన్నట్లు అభిషేక్ వెల్లడించారు. ఆ క్యాంప్ తర్వాత తన లక్ష్యం మారిపోయిందని ఆయన తెలిపారు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన అభిషేక్, యువరాజ్ తన బ్యాటింగ్ వీడియోలను చూసి, నోట్స్ రాసుకుని, పవర్ హిట్టింగ్‌ను మెరుగుపరచడానికి ఎలా సహాయం చేశాడో వివరించారు. ఆయన ఇంట్లో కూర్చొని మా వీడియోలు చూసేవారు, నోట్స్ రాసుకునేవారు. ఆ తర్వాత ముందు, తర్వాత ఎలా ఉందో పోల్చడానికి వివిధ వీడియోల నుండి స్క్రీన్‌షాట్‌లు తీసుకునేవారు. యువీ పాజీ ఇంత వివరంగా పని చేస్తారని ఎవరికీ తెలియదు. మేము ఐదు గంటలకు పైగా ప్రాక్టీస్ చేసినా, ఆయన మా పక్కనే ఉంటారని అభిషేక్ శర్మ యువరాజ్ శిక్షణ గురించి వివరించారు.
