NTV Telugu Site icon

Yuvraj Singh : ఆల్‪టైమ్ ప్లేయింగ్ XI ను ప్రకటించిన యూవీ.. ధోనీకి నో ఛాన్స్..

Yuvraj Singh

Yuvraj Singh

Yuvraj Singh : తాజాగా యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో ఇండియా ఛాంపియన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టైటిల్‌ ను గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌ లో పాక్‌ పై భారత జట్టు విజయం సాధించింది. ఈ విజయం తర్వాత యువరాజ్ సింగ్ మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో యువరాజ్ తన ఆల్ టైమ్ ప్లే ఎలెవన్ గురించి మాట్లాడాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ ప్లేయింగ్ ఎలెవన్‌ లో అతను భారత్‌ కు 3 ఐసిసి ట్రోఫీలు గెలిపించిన కెప్టెన్ ఎంఎస్ ధోనీని చేర్చలేదు. మొత్తంమీద అతను ముగ్గురు భారత ఆటగాళ్ల పేర్లను తీసుకున్నాడు.

Vivek Ramaswamy: “ట్రంప్‌ని దేవుడే రక్షించాడు”..భారతీయ అమెరికన్ వ్యాఖ్యలు..

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, టీవీ యాంకర్ షెఫాలీ బగ్గాతో యువరాజ్ సింగ్ ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. ఈ వైరల్ ఇంటర్వ్యూలో అతను తన ఆల్-టైమ్ ప్లే లెవెన్ గురించి మాట్లాడాడు. ఈ జాబితాలో యువరాజ్ సచిన్ టెండూల్కర్ మొదటి పేరును తెలపగా., అతనితో పాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ ను యువీ ఎంపిక చేశాడు. ఇక 3వ స్థానంలో టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ ను టీమ్ ఇండియా గెలవడానికి కారణమైన రోహిత్ శర్మను యువరాజ్ సింగ్ ఉంచాడు. అతను విరాట్ కోహ్లీని 4వ స్థానంలో ఉంచాడు. అతను 5, 6 నంబర్లలో ఇద్దరు విదేశీ ఆటగాళ్లను ఎంపిక చేశాడు. ఇందులో ఏబీ డివిలియర్స్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేర్లు కూడా ఉన్నాయి. ఆడమ్ గిల్‌క్రిస్ట్ కారణంగానే యువీ మరే ఇతర వికెట్ కీపర్‌గా పేరు చేర్చలేదు. ఎంఎస్ ధోనీని తన జట్టులోకి తీసుకోకపోవడానికి ఇదే కారణం కావచ్చు. యువీ వెటరన్ స్పిన్నర్లు షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్‌ లను 7, 8లో ఎంపిక చేశాడు. మిగిలిన 3 ఆటగాళ్ల కోసం అతను తన ఆల్ టైమ్ ప్లేయింగ్ ఎలెవన్‌ లో వసీం అక్రమ్, గ్లెన్ మెక్‌గ్రాత్, ఆండ్రూ ఫ్లింటాఫ్‌ లను ఎంచుకున్నాడు. ఇక చివరిగా తనని తాను 12 వ ఆటగాడిగా ఎన్నుకున్నాడు.

Donald Trump: ట్రంప్ హత్యాయత్నంపై స్పందించిన రష్యా.. ఏం చెప్పిందంటే..

యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో ఇండియా ఛాంపియన్స్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను ఓడించి వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టైటిల్‌ను గెలిచింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌ లో ఆస్ట్రేలియాపై యువరాజ్ అర్ధ సెంచరీ సాధించాడు. 28 బంతుల్లో 59 పరుగులు చేసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఫైనల్‌ లో అతను 22 బంతుల్లో 15 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

యువరాజ్ సింగ్ ఆల్-టైమ్ బెస్ట్ ప్లేయింగ్ 11: సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ (వికెట్ కీపర్), ఆండ్రూ ఫ్లింటాఫ్, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, గ్లెన్ మెక్‌గ్రాత్, వసీం అక్రమ్. (12 యువరాజ్ సింగ్).