Site icon NTV Telugu

Yuva Nidhi scheme: కర్ణాటకలో ‘యువ నిధి’ స్కీమ్ కు రంగం సిద్ధం.. అర్హులు ఎవరంటే?

Unemployment

Unemployment

కర్ణాటకలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన సంగతి తెలిసిందే.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతుంది.. మొన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ను ప్రవేశపెట్టింది.. ఇప్పుడు మరో హామీని నెరవేర్చబోతుంది.. యువతకు నిరుద్యోగ భృతి.. రాష్ట్రంలోని నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ‘యువ నిధి పథకం పేరుతో ప్రతీ నెల రూ. 3 వేలు అందిస్తామని అప్పుడు ఐదవ హామీగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది…

తాజాగా ఆ హామినీ నెరవేర్చే పనిలో ఉంది.. ఈ పథకం అమలు కోసం ఇప్పటికే రూ. 250 కోట్ల నిధులను విడుదల చేసింది. అర్హులైన నిరుద్యోగులను గుర్తించడానికి వీలుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను డిసెంబర్ 26వ తేదీ నుంచి ప్రారంభిస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం, రాష్ట్రంలో 5,29,123 మంది గ్రాడ్యుయేట్లు, డిప్లోమా హోల్డర్లు ఉన్నారు. వీరిలో 4,81,000 మంది గ్యాడ్యుయేట్లు, 48,153 డిప్లోమా హోల్డర్లు. యువనిథి పథకం కింద డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరికీ నెలకు రూ. 3 వేల చొప్పున, డిప్లోమా పూర్తి చేసిన యువతకు నెలకు రూ. 1500 చొప్పున నిరుద్యోగ భృతినికాంగ్రెస్ ప్రభుత్వం అందించనుంది..

2022-23 విద్యా సంవత్సరంలో డిగ్రీ లేదా డిప్లోమా పూర్తి చేసినవారు మాత్రమే ఈ నిరుద్యోగ భృతి పొందడానికి అర్హులు. వారు ఆయా కోర్సులు కర్ణాటకలో పూర్తి చేసి ఉండాలి. అలాగే, కనీసం గత ఆరు సంవత్సరాలుగా వారు కర్నాటకలో నివిసిస్తున్నవారై ఉండాలి. ఈ స్థానికతను 10వ తరగతి మెమో, డిగ్రీ సర్టిఫికెట్, సీఈటీ రిజిస్ట్రేషన్ నంబర్, రేషన్ కార్డ్ తదితరాల ద్వారా నిర్ధారిస్తారు.. ఈ పథకంను ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..

అర్హత గల అభ్యర్థులు అధికారిక ‘సేవాసింధు పోర్టల్’ http://sevasindhugs.karnataka.gov.in వెబ్ సైట్ కు లాగిన్ కావడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ అకడమిక్ సర్టిఫికేట్‌లను NAD పోర్టల్ లింక్ http://nad.karnataka.gov.in ద్వారా వారి డిగ్రీ లేదా డిప్లొమా రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఉపయోగించి విశ్వవిద్యాలయాలు లేదా విద్యా సంస్థల నుండి అప్‌లోడ్ చేసి తనిఖీ చేయవచ్చు..

ఈ పథకానికి ఎవరు అనర్హులు అంటే?

• ప్రభుత్వం ఉద్యోగంలో ఉండేవారు..
• ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు.
• స్వయం ఉపాధి పొందుతున్న వారు.
• ఉన్నత విద్యను కొనసాగిస్తున్న వారు..
• కర్ణాటకలో లేని వారు.. అంటే కర్ణాటక వాసి కానీ వాళ్లు..

Exit mobile version