Lok Sabha Election Results : భారత మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ రాజకీయాల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. నేడు వెలుబడిన 2024 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్ స్థానం నుంచి TMC అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అధిర్ రంజన్ చౌధురిపై దాదాపు 70,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. యూసుఫ్ పఠాన్‌కు 4,58,831 ఓట్లు రాగా, రంజన్‌కు 3,89,729 ఓట్లు వచ్చాయి.
Axis My India Exit Poll : ఎగ్జిట్ పోల్స్ విఫలమవ్వడంతో టీవీ షో మధ్యలో ఏడ్చిన సంస్థ ఎండీ
ఇక యూసుఫ్ పఠాన్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈయన 2007, 2011 ప్రపంచకప్ విజేత జట్ల సభ్యుడు. రాజకీయ నైపుణ్యుడు, బెంగాల్ పీఏసీ అధ్యక్షుడు, మూడుసార్లు ఎంపీగా గెలిచిన అధిర్ రంజన్ పై యూసుఫ్ విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధిర్ రంజన్ 1999 నుంచి వరుసగా మూడుసార్లు బరంపూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. పశ్చిమ బెంగాల్ లోక్ సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. బెంగాల్‌లో మొత్తం 42 స్థానాలు ఉండగా, సర్వే అంచనాలకు మించి 29 స్థానాలతో టిఎంసి గెలిచే అవకాశం ఉంది. స్పష్టమైన విజయం సాధిస్తుందని భావించిన బీజేపీ 12 స్థానాలకే పరిమితమైంది.
Lok Sabha Elections Yusuf Pathan Won on Congress Leader Adhir Ranjan Chowdhury