NTV Telugu Site icon

Yusuf Pathan Fifty: యూసఫ్ పఠాన్ విధ్వంసం.. 14 బంతుల్లోనే 61 రన్స్! చుక్కలు చూసిన పాక్ బ్యాటర్

Yusuf Pathan

Yusuf Pathan

IND Batter Yusuf Pathan Smashes PAK Pacer Mohammad Amir For 24 Runs In Single Over: టీమిండియా మాజీ ఆల్‌‌రౌండర్ యూసఫ్ పఠాన్ విధ్వంసం సృష్టించాడు. నాలుగు పదుల వయసులోనూ ఆకాశమే హద్దుగా చెలరేగి.. తనలో బ్యాటింగ్ చేసే సత్తా ఇంకా ఉందని చాటిచెప్పాడు. సిక్స్‌ల వర్షం కురిపిస్తూ 14 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. యూఏఈ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న టీ10 లీగ్‌లో పఠాన్ ఈ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో జోబర్గ్ బఫ్పాలోస్ జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు.

టీ10 లీగ్‌లో భాగంగా శుక్రవారం జోబర్గ్ బఫ్పాలోస్, డర్బన్ ఖలాండర్స్ జట్ల మధ్య క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన డర్బన్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఆండ్రీ ఫ్లెచర్ (39), ఆసిఫ్ అలీ (32 నాటౌట్) టాప్‌ స్కోరర్లు. ఇన్నింగ్స్ చివరలో వెల్చ్ నిక్ 9 బంతుల్లో 24 రన్స్ చేశాడు. జోబర్గ్ బౌలర్లు రవి బొపారా, సీజే డాల తలో రెండు వికెట్స్ పడగట్టారు.

Also Read: IND vs WI 2nd ODI: విండీస్‌తో రెండో వన్డే.. సిరీస్‌పై భారత్‌ గురి! సంజూకు మరోసారి నిరాశే

141 పరుగుల లక్ష్య చేధనలో జోబర్గ్ బఫ్పాలోస్ జట్టు 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో జోబర్గ్ టీమ్‌ను యూసఫ్ పఠాన్ ఆదుకున్నాడు. ముష్ఫికర్ రహీమ్ (14 నాటౌట్) అండతో జట్టుకు ఊచించని విజయాన్ని అందించాడు. జోబర్గ్ విజయానికి చివరి 18 బంతుల్లో 64 పరుగులు అవసరం అయ్యాయి. దాంతో డర్బన్ ఖలాండర్స్ సునాయాసంగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. అయితే యూసఫ్ పఠాన్ సిక్స్‌ల వర్షం కురిపిస్తూ 14 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు.

పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ బౌలింగ్‌ను యూసఫ్ పఠాన్ ఓ ఆటాడుకున్నాడు. అమీర్ వేసిన 6 బంతులను 6,6,0,6,2,4 బాది.. ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్లోనూ విరుచుకుపడ్డాడు. పఠాన్ సునామీ ఇన్నింగ్స్‌తో జోబర్గ్ బఫ్పాలోస్ జట్టు 9.5 ఓవర్లలో 4 వికెట్లకు 142 పరుగులు చేసి గెలుపొందింది. యూసఫ్ తన ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లు బాదడం విశేషం. మొత్తంగా 26 బంతుల్లో 80 రన్స్ చేశాడు. యూసఫ్ విధ్వంసానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read: Gold Today Price: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు!