NTV Telugu Site icon

Yusuf Pathan: నేను ఎంపీ అయ్యాను కాబట్టే బుల్డోజర్లు తెస్తారు..

Yusuf

Yusuf

Yusuf Pathan: టీమిండియా మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ యూసుఫ్ పఠాన్ భూ ఆక్రమణకు సంబంధించి వడోదర మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) నుంచి నోటీసు అందుకున్న తర్వాత గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. తాండల్జాలోని వీఎంసీకి చెందిన ప్లాట్‌లో ఆక్రమణలను 15 రోజుల్లోగా తొలగించాలని పఠాన్‌కు జూన్ 6వ తేదీన నోటీసు జారీ చేసింది.

Read Also: Devara : “ఫియర్ సాంగ్” సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్..

అయితే, ఆ భూమి కోసం తాను 2012లో దరఖాస్తు చేసుకున్నానని, 2014లో కార్పొరేషన్ మరో ప్లాన్‌ను ప్రతిపాదించిందని టీఎంసీ ఎంపీ యూసఫ్ పఠానా కోర్టుకు తెలిపారు. ఇక, పఠాన్ తరపు న్యాయవాది హైకోర్టులో మాట్లాడుతూ.. నా క్లైంట్ ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికయ్యారు.. వేరే పార్టీ (టీఎంసీ) నుంచి ఎన్నికైనందుకు అతడ్ని వేధించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో ఎలాంటి నోటీసులు ఇవ్వని వీఎంసీ.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అకస్మాత్తుగా జూన్ 6వ తేదీన నోటీసు పంపారు అని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తారు. కాగా, నేను వారి డిమాండ్‌ను అంగీకరించకపోతే, వారు బుల్‌డోజర్‌లను తీసుకువస్తారు అంటూ ఎంపీ యూసఫ్ పఠాన్ తెలిపారు.