Kadapa ZP Chairman: కడప జడ్పీ చైర్మన్ ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈనెల 27న జడ్పీ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ సిట్టింగ్ జడ్పీ చైర్మన్ స్థానాన్ని కాపాడుకోవడానికి కసరత్తు ప్రారంభించింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.
Read Also: Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదుల్ని చుట్టుముట్టిన భద్రతా దళాలు..
వైసీపీ అధిష్టానం తమ పార్టీకి చెందిన జడ్పిటిసి సభ్యులను క్యాంపుకు తరలించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. ఇందుకోసం హైదరాబాద్ లేదా ఇడుపులపాయను ఎంపిక చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయి. అయితే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన కారణంగా జడ్పిటిసిల తరలింపు ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది.
Read Also: SRH vs RR: సొంత గడ్డపై సన్‌రైజర్స్ ఘన విజయం.. ఐపీఎల్ చరిత్రలో మరో రికార్డు..
ఇప్పటికే మాజీ సీఎం జగన్ పులివెందుల చేరుకున్న నేపథ్యంలో, మరికాసేపట్లో ఉమ్మడి కడప జిల్లాకు చెందిన వైసీపీ జడ్పిటిసి సభ్యులతో ఆయన సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నట్లు సమాచారం. జడ్పిటిసిలను హైదరాబాద్ తరలిస్తారా? లేక ఇడుపులపాయలోనే క్యాంపు నిర్వహిస్తారా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. జగన్ సమావేశం అనంతరం ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా, వైసీపీకి చెందిన సభ్యులను ఏదైనా సురక్షిత ప్రదేశానికి తరలించడం ద్వారా పార్టీ లోటు సీమలో జడ్పీ చైర్మన్ పదవిని కాపాడుకునే వ్యూహాన్ని రూపొందిస్తోంది.