వైసీపీ రెబల్ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ అనర్హత వేటుపై రేపు విచారణ జరగనుంది. మండలి చైర్మన్ పంపించిన నోటీసులకు ప్రత్యక్షంగా హాజరై అఫిడవిట్ సమర్పించనున్నారు వంశీ. డిస్‍క్వాలిఫికేషన్ తనకు ఎందుకు వర్తించదో చెప్పేందుకు అవసరమైన సమాధానం ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. రెబల్ ఎమ్మెల్సీ ఇచ్చే వివరణతో మండలి చైర్మన్ సంతృప్తి చెందకపోతే అనర్హత వేటు ఖాయం అవుతుంది. ఒకవేళ అదే సాధ్యమైతే అనర్హత నిర్ణయాన్ని కోర్టులో చాలెంజ్ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్.
Read Also: Fire Accident: నాసిన్ అకాడమీలో అగ్నిప్రమాదం.. చెలరేగిన మంటలు
ఎమ్మెల్సీకి అందిన నోటీసులు మీద ఇప్పటికే మండలి పదిరోజులు గడువు ఇచ్చింది. మరోసారి పొడింగించాలని అభ్యర్ధించిన తిరస్కరించారు చైర్మన్. ఈ నేపథ్యంలో నేరుగా కౌన్సిల్ ముందు హాజరై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని వంశీ నిర్ణయించుకున్నారు. వైసీపీ మీద అసంతృప్తితో బయటకు వెళ్ళానే తప్ప తాను ఏ పార్టీలోనూ అధికారికంగా చేరలేదు కనుక డిస్ క్వాలిఫికేషన్ పరిధిలోకి రాబోననేది ఆయన చెబుతున్నారు. అదే సమయంలో స్ధానిక సంస్ధల కోటాలో ఏకగ్రీవంగా గెలిచినందున తనపై చర్యలు తీసుకునే అవకాశం మండలి చైర్మన్ కు ఎంత వరకు వుంటుందనే ప్రశ్నను ఎమ్మెల్సీ లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది.
Read Also: Prashant Kishore: ‘‘ఇది మూన్నాళ్ల ముచ్చటే’’.. బీహార్ రాజకీయాలపై ఎన్నికల వ్యూహకర్త పీకే సంచలనం..