Site icon NTV Telugu

Kotamreddy Sridhar Reddy: నా మీద కుట్రలు చేస్తున్నారు… బెదిరిస్తున్నారు

Kotamreddy Phone Tapping

Kotamreddy Phone Tapping

నెల్లూరు జిల్లా రాజకీయంలో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. నెల్లూరు రూరల్ .ఎం.ఎల్.ఏ.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి మీడియా ముందుకి వచ్చారు. వై.సి.పి లో కొనసాగడం ఇష్టంలేక మౌనంగా నిష్క్రమిస్తాం అని అనుకున్నా. కానీ నా వ్యక్తిత్వాన్ని శంకించేలా మాట్లాడుతున్నారు. అందుకే సమాధానం చెబుతున్నా. మా బావ కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా మాట్లాడాడు. బంధువునని.. మాట్లాడక పోతే బాగుండేదని అలా అంటున్నాడు. గతంలో నీకు వీర విధేయుడినే..ఇప్పుడు కాదు. నన్ను నమ్మక ద్రోహం అంటున్నావు. నిన్ను జెడ్.పి.చైర్మన్ చేసిన ఆనం రామనారాయణ రెడ్డి ని ఎందుకు విభేదించావు.

Read Also:Kisan Agro Feed: కిషన్ఆగ్రో ఫీడ్ కంపెనీ క్లోజ్ చేయండి.. మూడు రోజులుగా నిరాహార దీక్ష

వై.ఎస్.కుటుంబం గురించి మాట్లాడే అర్హత లేదు. జగన్ ఓదార్పు యాత్ర అప్పుడు ఏమి చెప్పావు. కాంగ్రెస్ మహా సముద్రం..జగన్ ఒక నీటి బొట్టు అన్నావు. జగన్ తో నడిస్తే ఎలాంటి భవిష్యత్ ఉండదని చెప్పావుగా. పొదలకూరు లో వై.ఎస్.ఆర్.విగ్రహం.పెట్ట నేయకుండా అడ్డుకున్నావు. వై.సి.పి.ఎం.ఎల్.ఏ.గా వుంటూ చంద్రబాబు కాళ్లకు దండం పెట్టిందెవరు..నువ్వు కాదా..ఇది అందరికీ తెలుసు. మాట మాటకు సమాధానం ఇస్తానన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

నకిలీ పత్రాల కేసులో జాగ్రత్తగా ఉండు. అన్ని వేళ్ళు నీ వైపు చూస్తున్నాయి. వై.సి.పి.లో మార్కులు కావాలంటే నన్ను తిట్టు. సజ్జల ను విమర్శిస్తే మా బావకు కోపం వచ్చింది. నేను ఎవరు ఫోన్ చేసినా ఎత్తుకుంటా. ఈ మధ్య కాలంలో ఫోన్లు ఎక్కువ వస్తున్నాయి. ఇందులో 10 శాతం కాల్స్ బెదిరంపులే. నిన్న ఒక కాల్ వచ్చింది. బోరుగడ్డ అనిల్ అని ఫోన్ చేశాడు. నన్ను బెదిరించి..కొట్టేసి తీసుకెళతానన్నావు. తీసుకెళ్లు చూద్దాం. నీ మాటలకు బెదరం. సజ్జలనే ఈ ఫోన్లు చేయిస్తున్నారు. నేను కూడా చేయిస్తాం..వీడియో కాల్స్ వస్తాయి. నా మీద నిన్న కిడ్నాప్ కేసు పెట్టారు. సలహాదారుడిగా అన్ని విధులు మరిచి ఆపరేషన్ నెల్లూరు రూరల్ చేపట్టావ్. అనిల్ ను ప్రయోగించిన సజ్జల గురించి బెదరం. అధికారం చేతిలో ఉందని ఇలా చేయడం సరికాదు. ఎందుకు నా మీద కుట్రలు..చేస్తున్నారు. మంత్రులు..ఎం.ఎల్.ఏ.లు మా కార్పొరేటర్ లతో మాట్లాడుతున్నారన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

Read Also: Kotamreddy Sridhar Reddy Pressmeet Live: కోటంరెడ్డి సంచలన ప్రెస్ మీట్

Exit mobile version