NTV Telugu Site icon

YSRCP: గాలి, నీరు నేనే కనిపెట్టానని కూడా చంద్రబాబు చెప్తారు..!

Kaile Anil Kumar

Kaile Anil Kumar

టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారు వైసీపీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దళితుల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారని ప్రశ్నించిన చంద్రబాబు.. దళిత బాంధవుడు ఎలా అయ్యారు? అని ప్రశ్నించారు.. దళితులపై దాడులకు కారకులైన చంద్రబాబు దళితులకు పెన్నిధి ఎలా అయ్యారు? అని నిలదీశారు.. ఎస్సీ నియోజకవర్గాలలో అధిక భాగం ఎందుకు ఓడిపోయారో అర్థం చేసుకో చంద్రబాబు అని సూచించిన ఆయన.. 28 పథకాలు దళితుల కోసం తన హయాంలో పెట్టినట్లు అబద్దాలు చెప్తున్నారు.. అసలు జగన్ హయాంలోనే దళితులకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఇక, సెల్ ఫోన్ తానే కనిపెట్టానని చంద్రబాబు చెప్తున్నారు.. చివరికి గాలి, నీరు కూడా నేనే కనిపెట్టానని కూడా చంద్రబాబు చెప్తారు అంటూ ఎద్దేవా చేశారు.. ఎంతమంది దళితులకు చంద్రబాబు హయాంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారో చెప్పాలి అంటూ సవాల్‌ చేవారు ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌.

Read Also: CM YS Jagan: రోడ్ల నాణ్యతపై మరింత దృష్టి.. ఏడాదికే రిపేరు చేయాల్సిన పరిస్థితి రావొద్దు..!

మరోవైపు దళితులకు ఎవరేం చేశారో అసెంబ్లీలో చర్చిద్దాం.. మా‌ సవాల్ ని స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా? అంటూ చాలెంజ్ చేశారు వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్.. దీని పై రెండు రోజులు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయించటానికి మేం రెడీ అన్న ఆయన.. 2 లక్షల కోట్లు పేదల ఖాతాలో వేస్తే అందులో అధికభాగం లబ్ది పొందింది దళితులే అని స్పష్టం చేశారు.. 28 పథకాలు తీసేశామని చంద్రబాబు చెప్తున్నారు.. ఆ పథకాలు, వాటి ద్వారా లబ్దిపొందిన వారి లిస్టు బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు.. చంద్రబాబు, లోకేష్ డీఎన్‌ఏలోనే ఏదో తేడా ఉంది అంటూ విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌ కుమార్‌.