Site icon NTV Telugu

YSRCP: జడ్పీటీసీ ఉప ఎన్నికలు.. ఈసీ ఎదుట వైసీపీ ధర్నా

Ysrcp

Ysrcp

YSRCP: కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు కాకరేపుతున్నాయి.. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. మరోవైపు తెల్లవారుజాము నుంచే పులివెందులలో టెన్ష్‌ వాతావరణం నెలకొంది.. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డితో పాటు.. పలువురు వైసీపీ నేతలను, టీడీపీ నేతలను కూడా అరెస్ట్‌, హౌస్‌ అరెస్ట్‌ చేశారు పోలీసులు.. అయితే, పులివెందుల, ఒంటిమిట్టలో పోలీసుల వైఖరిపై భగ్గుమంటోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు ధర్నాకు దిగారు వైసీపీ నేతలు.. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల ఘటనలకు నిరసనగా ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ఎదుట బైఠాయించారు.. పోలీసులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని నినాదాలు.. ఎన్నికల కమిషన్‌ దగ్గర జరిగిన ఆందోళన కార్యక్రమంలో మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, హఫీజ్ ఖాన్.. పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు..

Read Also: Ravindranath Reddy: పోలీసులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.. అరెస్టులు దారుణం..

ఇక ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్నీని కలిసిన వైసీపీ నేతల బృందం.. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై ఎలక్షన్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.. ఎన్నికల సందర్భంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు వైసీపీ నేతలు.. ఓటు హక్కు ఉన్న ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.. ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి ఫిర్యాదు చేసినవారిలో మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి , మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, హఫీజ్ ఖాన్ తదితరలు ఉన్నారు..

Exit mobile version