Minister Gummanur Jayaram: వైసీపీ అధిష్టానంపై మంత్రి గుమ్మనూరు జయరాం అలిగారని.. కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం సాగింది.. తన సీటు మార్చడంపై వైసీపీ అధిష్టానంతో అసంతృప్తితో ఉన్నారనే మాటలు వినిపించాయి.. ఆ తర్వాత ఆయన కేబినెట్ సమావేశానికి హాజరు అయ్యారు.. దీంతో, ఆ ప్రచారానికి కొంత వరకు తెరపడినట్టు అయ్యింది.. మరోవైపు.. మంత్రి జయరాం.. వైసీపీలోనే కొనసాగుతారు అని స్పష్టం చేశారు వైసీపీ రీజినల్ ఇంచార్జి రామసుబ్బారెడ్డి.. ఆలూరులో వైసీపీ ఇంచార్జ్ బుసిని విరుపాక్షి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో కోఆర్డినేటర్ రామ సుబ్బారెడ్డి, మేయర్ బివై రామయ్య ఇతర నేతలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. మంత్రి జయరాంకు గౌరవంగా ఎంపీ స్థానం అధిష్టానం కేటాయించిందన్న ఆయన.. జయరాంకు కార్యకర్తల సమావేశం సమాచారం ఇచ్చాం.. కానీ, సొంత పనిపై వెళ్తున్నానని, హాజరు కాలేకపోతున్నానని చెప్పారని వెల్లడించారు.. మంత్రి జయరాంకు పెద్ద హోదా కల్పించారు.. మంత్రి దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Read Also: Punjab: పంజాబ్ గవర్నర్ షాకింగ్ నిర్ణయం
ఇక, ప్రతి పేదవాడికి సీఎం వైఎస్ జగన్ అండగా ఉన్నారని తెలిపారు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి.. 3,650 కిలోమీటర్ల పాదయాత్ర చేసి వైఎస్ జగన్ ప్రజలకు చేరువయ్యారు.. టీడీపీ ప్రభుత్వం రాజధాని పేరుతో 57 వేల ఎకరాలను రైతులతో కొల్లగొట్టి ఉన్నవాళ్లకు దోచి పెట్టిందని దుయ్యబట్టారు. పార్టీలకు అతీతంగా సీఎం వైఎస్ జగన్ పథకాలు అందుతున్నాయని ప్రశంసలు కురిపించారు. టీడీపీ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చే పథకాలు ఏమైనా ఉన్నాయా..? అని నిలదీశారు రామసుబ్బారెడ్డి.. మరోవైపు.. రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసే దమ్ము తెలుగుదేశం పార్టీకి ఉందా?ణ అని సవాల్ చేశారు. ఒంటరిగా పోటీ చేయలేకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో చంద్రబాబు జత కట్టారు అని ఆరోపణలు గుప్పించారు రామసుబ్బారెడ్డి..