NTV Telugu Site icon

Gopireddy Srinivasa Reddy: పోసానిపై 14 కేసులా..? మీరు 3 కేసులు పెడితే రేపు 30 పెట్టే సమయం ఉంది..!

Gopireddy Srinivasa Reddy

Gopireddy Srinivasa Reddy

Gopireddy Srinivasa Reddy: పోసాని కృష్ణమురళిపై 14 కేసులు నమోదు చేశారని ఫైర్‌ అయ్యారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.. టీడీపీ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు ఇచ్చారని అరెస్ట్ చేశారు.. 41 ఏ నోటీస్ ఇచ్చి వదిలే కేసులో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు.. ఈ విషయంలో చంద్రబాబు, లోకేష్ ఒప్పుకోవడం లేదని తెలుస్తుందన్నారు. ఇప్పుడు నరసరావుపేట తీసుకొచ్చారు.. బాపట్ల పోలీసులు పీటీ వారెంట్‌ వేయడానికి సిద్ధంగా ఉన్నారు.. అసలు భారత రాజ్యాంగం నడుస్తుందా? లోకేష్ రాజ్యాంగం నడుస్తుందా? అని ప్రశ్నించారు..

Read Also: Sridhar Babu: పాఠ్యాంశాలు మార్చాలి.. విద్యా వ్యవస్థ ముఖచిత్రం మారాలి

పోసాని విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసారని తప్ప.. వేరే ఏ విషయం లేదన్నారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష ఆనందం కోసం కేసులు పెడుతున్నారని విమర్శించారు.. మీరు 3 కేసులు పెడితే రేపు 30 కేసులు పెట్టే సమయం ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైస్సార్సీపీ వాళ్లకు పరోక్షంగా, ప్రత్యక్షంగా సహకరించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారు.. అసలు వైస్సార్సీపీ ఓటర్లకు చంద్రబాబు ముఖ్యమంత్రి కదా? అని న ఇలదీశారు.. ఆంధ్రప్రదేశ్‌లో అన్యాయంగా పాలన సాగుతుంది.. ప్రభుత్వం పై వ్యతిరేకత పెరుగుతుంది.. ఉత్తరాంధ్రలో కూటమి MLC అభ్యర్థి కంటే prtu అభ్యర్థి ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు.. 2023 లో పెట్టిన కేసు రొంపి చర్లలో బయటకు తీసి భయపెడుతున్నారు.. కేసులు పెట్టి వైస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారు.. వైస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుంది.. ఖచ్చితంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి..