NTV Telugu Site icon

Merugu Nagarjuna: ఏపీలో మరోసారి వైసీపీదే అధికారం.. చంద్రబాబు ప్రస్టేషన్ అర్థమైతుంది..!

Meurga

Meurga

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుంది అని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. ఇది పేదలకు పెత్తందారులకు మద్య జరిగిన యుద్ధం.. ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారు.. జూన్ నాలుగోవ తేదీన వైసీపీ సునామీ రాబోతుంది.. చంద్రబాబు ప్రస్టేషన్ లోకి వెళ్ళాడు.. పల్నాడు జిల్లాలో వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారు.. సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచాలని కోరినా కూడా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు అని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై చంద్రబాబు ఎన్నికలలో అక్రమాలకు పాల్పడ్డారు.. పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారు.. అధికారంలోకి రాగానే ఎన్నికల్లో అక్రమాలకు వంతపాడిన పోలీసు అధికారులపై విచారణ జరిపిస్తాం అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.

Read Also: Sangareddy: జీతాలు చెల్లించండం.. ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల ఆందోళన

అలాగే, ఘోరాతి ఘోరంగా ఎన్నికల్లో టీడీపీ నేతలు దాడులు చేశారు అని మేరుగ నాగార్జున మండిపడ్డారు. జూన్ 4వ తేదీన రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయం లిఖిస్తాం.. రాష్ట్రంలో రామరాజ్యం రాబోతుంది.. పేదలు వైసీపీకి ఓటు వేశారని దాడులు చేస్తున్నారు.. వైసీపీకి అండగా నిలిచిన ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలపై పని గట్టుకొని టీడీపీ దాడులకు ఉసిగొల్పింది.. డీబీటిల ద్వారా నిధులు ప్రజల ఖాతాల్లోకి రాకుండా టీడీపీ అధినేత నారా చంద్రబాబే అడ్డుకున్నది అని మంత్రి మేరుగ నాగార్జున వెల్లడించారు.

Show comments