NTV Telugu Site icon

AP Elections 2024: ఏబీ వెంకటేశ్వరరావు, ఆర్పీ ఠాకూర్‌పై ఈసీకి వైసీపీ ఫిర్యాదు..

Ec

Ec

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరుగుతోన్న వేళ.. ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, మాజీ ఐపీఎస్‌ ఆర్పీ ఠాకూర్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. టీడీపీకి అనుకూలంగా పనిచేసేలా ఎన్నికల సిబ్బందిని ప్రభావితం చేస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.. మంగళగిరి టీడీపీ ఆఫీస్‌ వేదికగా అధికారులను బెదిరిస్తున్నారన్న వైసీపీ.. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో కూర్చొని జిల్లాల పోలీసు అధికారులకు ఫోన్లు చేస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.. ఎన్నికల సిబ్బందిని టీడీపీ అనుకూలంగా పనిచేసేలా ప్రభావితం చేస్తున్నారని ఐపీఎస్ అధికారి ఏబీ వేంకటేశ్వర రావు, మాజీ ఐపీఎస్ ఆర్పీ ఠాకూర్ పై ఈసీకి ఫిర్యాదు చేసింది వైసీపీ.. రెండు సార్లు సస్పెండ్ అయిన అడిషనల్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, రిటైర్డ్ డీజీ ఆర్‌పీ ఠాగూర్ మరికొందరు పోలీస్ అధికారులు మంగళగిరి టీడీపీ ఆఫీసులో కూర్చుని జిల్లాల పోలీసు అధికారులకు ఫోన్ లు చేసి టిడిపికి అనుకూలంగా వ్యవహరించాలని బెదిరింపులకు దిగుతున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లీగల్ సెల్ రాష్ర్ట అధ్యక్షుడు మనోహర్ రెడ్డి.

Read Also: Bomb Threat : జైపూర్ తర్వాత ఇప్పుడు లక్నోలోని స్కూళ్లకు బాంబు బెదిరింపులు