Site icon NTV Telugu

Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా వైసీపీ క్యాండిల్ ర్యాలీ..

Pahalgam

Pahalgam

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని ప్రతి భారతీయుడు రగిలిపోతున్నాడు. ఉగ్రమూకల దాడిని ప్రపంచ దేశాధినేతలు ఖండిస్తున్నారు. ఉగ్రవాదులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది టూరిస్టులు మృత్యువాత పడిని విషయం తెలిసిందే. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా వైసీపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది.

Also Read:Pahalgam Terror Attack: పహల్గామ్ దాడుల ప్రధాన సూత్రధారి సైఫుల్లా కసూరి..!

తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమైంది. కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేశారు వైసీపి నేతలు, కార్యకర్తలు.. పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్, మేరుగ నాగార్జున, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణమూర్తి, అధికార ప్రతినిధులు కారుమూరి వెంకటరెడ్డి, శివశంకర్, ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, మంగళగిరి ఇన్‌ఛార్జి వేమారెడ్డి, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.

Exit mobile version