YSRCP Boycotts MPTC, ZPTC Elections in Narasaraopet: తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. నర్సరావుపేటలో ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ప్రకటన చేశారు. నర్సరావుపేటలో నామినేషన్ల ఘట్టంపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రక్షణ కల్పిస్తామని పోలీసులు మాట తప్పారని ఆరోపించారు. మూడు రోజులు ఎదురుచూసినా నిరాశే మిగిలిందని పేర్కొన్నారు. నర్సరావుపేట పోలీసులు రక్షణ కల్పిస్తామంటూనే, ఒకవేళ దాడి జరిగితే తమకు సంబంధం లేదన్నారని విమర్శించారు. అంతేకాకుండా నామినేషన్ల సమయం ముగిసే సమయానికి మాత్రమే పోలీసులు వచ్చారని తెలిపారు. రెండు మండలాల అభ్యర్థులతో నామినేషన్లు వేయించమని కోరితే, కేవలం రొంపిచర్ల మండల అభ్యర్థులతో నామినేషన్లు వేసేందుకు మాత్రమే అనుమతిస్తామని పోలీసులు అన్నారన్నారు. ఇక పోలీసుల మాటలను నమ్మి నామినేషన్లకు వెళ్లడానికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. నామినేషన్ సెంటర్ల వద్ద రెండు వేల మంది టీడీపీ కార్యకర్తలు దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో తమ వైసీపీ ఆడబిడ్డల భద్రతను పణంగా పెట్టి అక్కడికి పంపించలేమని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
Gopireddy Srinivasa Reddy: వైసీపీ సంచలన నిర్ణయం.. నర్సరావుపేటలో ఎన్నికలు బహిష్కరించిన వైసీపీ

Gopireddy Srinivasa Reddy
