ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. నిరు పేద యువతుల వివాహాలకు సహకారం అందించేందికి వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పేరుతో పథకాలను తీసుకువస్తున్న విషయం విదితమే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల కోసం వైఎస్సార్ కల్యాణమస్తు, ముస్లిం మైనారిటీల కోసం వైఎస్సార్ షాదీ తోఫాను అందిస్తూ వస్తోంది ప్రభుత్వం.. ఇక, ఇప్పుడు మరో 10,132 జంటలకు శుభవార్త చెప్పారు సీఎం వైఎస్ జగన్.. అక్టోబర్- డిసెంబర్, 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ పథకం కింద 10,132 జంటలకు సంబంధించిన తల్లుల ఖాతాల్లో రూ.78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని ఇవాళ (మంగళవారం) విడుదల చేయనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరగనున్న కార్యక్రమంలో బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో సంబంధిత సొమ్మును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జమ చేయనున్నారు.
Read Also: Gautam Adani : గౌతమ్ అదానీ ఖాతాలోకి రాబోతున్న రూ.21,580 కోట్లు.. కొనసాగుతున్న చర్చలు
కాగా, ఈ పథకాల ద్వారా నిరుపేదల కుటుంబాలకు బాసటగా నిలుస్తూనే.. మరోవైపు బాల్య వివాహాలకు వైఎస్ జగన్ సర్కార్ చెక్ పెడుతోంది. వధువు వయస్సు 18 ఏళ్లు, వరుడి వయస్సు 21 ఏళ్లు నిండాలనే నిబంధన పెట్టారు.. దీంతో ఇద్దరూ తప్పని సరిగా పదవ తరగతి పాసై ఉండాలి.. ఆ కుటుంబాల్లో ఆదాయపన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉండరాదు. ఎస్సీ, ఎస్టీ వధూవరులకు 1 లక్ష రూపాయలు.. బీసీలకు 50 వేల రూపాయలు.. మైనారిటీలకు 1 లక్ష రూపాయలు అందిస్తున్నారు.. ఇక, ఎస్సీ, ఎస్టీలు కులాంతర వివాహం చేసుకుంటే 1లక్షా 20 వేల రూపాయలు.. బీసీలు కులాంతర వివాహం చేసుకుంటే 75 వేల రూపాయలు.. దివ్యాంగులకు 1 లక్షా 50 వేల రూపాయలను జగన్ ప్రభుత్వం అందిస్తోంది.