YSR Congress Party: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పాలిటిక్స్ హీట్ పెంచుతున్నాయి.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రుల్లోను టెన్షన్‌మొదలైంది.. దానికి ప్రధాన కారణం.. మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్థాలచలనం కలగడమే.. మరికొందరికి అయితే, సీటు కూడా కష్టమని అధిష్టానం నుంచి క్లారిటీగా సందేశాలు వెళ్లాయి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండో లిస్ట్ రెడీ అవుతుందట.. నేడో, రేపో ఆ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.. మొదటి విడతలో 11 సెగ్మెంట్లలో మార్పులు చేశారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. అందులో ముగ్గురు మంత్రులకు కూడా స్థానచలనం తప్పలేడు.. ఇప్పుడు దాదాపుగా సెకెండ్ లిస్ట్ కొలిక్కి రావడంతో.. అందులో పేరు ఎవరిది ఉంటుంది.. అధిష్టానం నుంచి పిలుపు ఎవ్వరికి రానుందే అనేది ఉత్కంఠగా మారిపోయింది.
Read Also: Ashwini Sree: అందాలు అరబోస్తున్న బిగ్ బాస్ బ్యూటీ అశ్విని శ్రీ…
ఇక, క్లారిటీ వచ్చిన నియోజకవర్గాలను ఎప్పటికప్పుడు ప్రకటించేయాలనే ఆలోచనలో అధిష్టానం ఉందట.. పక్క పార్టీ వాళ్లతో టచ్ లోకి వెళ్తున్నారు టికెట్ రాదని నిర్ధారణ అయిన పలువురు ఆశావహులు.. ఈ సారి ఉభయగోదావరి జిల్లాల్లో పలు మార్పులు ఉంటాయనే ప్రచారం సాగుతోంది.. అనకాపల్లి జిల్లాలో మొత్తం ఏడు సెగ్మెంట్లలో మార్పులకు ఛాన్స్ ఉందట.. అనకాపల్లి, పెందుర్తి, పాయకరావుపేట, చోడవరం, యలమంచిలి, మాడుగుల, నర్సీపట్నం సెగ్మెంట్లలో మార్పులు ఉంటాయని సమాచారం.. మరోవైపు.. ఉభయగోదావరి జిల్లాల్లో అమలాపురం, రామచంద్రాపురం, నరసరావుపేట, జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురంలో మార్పు తప్పదనే చర్చ సాగుతోంది..
Read Also: Fair Accident: రంగారెడ్డిలో అగ్నిప్రమాదం.. పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి
పి. గన్నవరం మోకా సత్తిబాబు వైఫ్ లక్ష్మీ పేరు పరిశీలనలో (ఎస్సీ మాల ) ఉండగా.. పి. గన్నవరంను ఎంపీ చింతా అనురాధ అడుగుతున్నారు.. పాయకరావుపేట నుంచి పోటీ చేయాలని పార్టీ సూచించిందట.. పండుల రవీంద్ర బాబు పేరు ఐనవల్లి శ్రీనివాస్, పేరు కూడా పరిశీలనలో ఉన్నాయట.. ఇక, అమలాపురం విశ్వరూప్ కొడుకు డా. శ్రీకాంత్, రాజోలులో రాపాక వరప్రసాద్ లేదా.. మట్టా శైలజ పేరు వినిపిస్తుండగా.. రాపాకను అమలాపురం ఎంపీగా పంపాలనే ఆలోచనలో పార్టీ ఉందని ప్రచారం సాగుతోంది.. రామచంద్రపురం నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకు పిల్లి ప్రకాశ్ వినిపిస్తుండగా.. రాజమండ్రి రూరల్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి అర్బన్.. మార్గాని భరత్, జగ్గంపేట.. తోట నరసింహం, ప్రత్తిపాడు.. పర్వత జానకి దేవి, పిఠాపురం.. వంగా గీత, పెద్దాపురం నుంచి ముద్రగడ పద్మనాభంను బరిలో పెట్టే ప్రయత్నాల్లో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం.. దీంతో.. ఫైనల్ లిస్ట్ ఎలా ఉంటుంది.. మా సీటు ఉంటుందా? ఊడుతుందా? మార్పు తప్పదా? అనే టెన్షన్.. మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. ఆశావహుల్లో కనిపిస్తోంది.