NTV Telugu Site icon

YS Sharmila: ఫిబ్రవరి 17న వైఎస్‌ షర్మిల కుమారుడి వివాహం.. ట్వీట్ వైరల్!

Ys Sharmila Son Marriage

Ys Sharmila Son Marriage

Atluri Priya, YS Raja Reddy’s engagement on January 18th: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. అనిల్ కుమార్, వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజా రెడ్డి 2024 ఫిబ్రవరి 17న పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ విషయాన్ని వైఎస్ షర్మిల సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. అట్లూరి ప్రియాతో రాజా రెడ్డికి వివాహం జరగనున్నట్లు వైఎస్ షర్మిల తెలిపారు. రాజా రెడ్డి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి.

రాజా రెడ్డి, అట్లూరి ప్రియ వివాహంపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తోన్నప్పటికీ వైఎస్ షర్మిల స్పందించలేదు. న్యూఇయర్ సందర్బంగా తనయుడి వివాహంపై మౌనం వీడారు. ‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా కుమారుడు రాజా రెడ్డికి అట్లూరి ప్రియాతో జనవరి 18న నిశ్చితార్థం జరగనుంది. ఫిబ్రవరి 17న వివాహం జరగనున్న సంగతి మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మంగళవారం (జనవరి 2) కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శిస్తాం. అక్కడ ఆహ్వాన పత్రికను ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకుంటాం’ అని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.

Also Read: Manickam Tagore: మోడీ పాలనలో ఏపీకి అన్యాయం జరిగింది: మాణిక్కం ఠాగూర్

వైఎస్ రాజా రెడ్డి, ప్రియా అట్లూరిది ప్రేమ వివాహం. ఈ ఇద్దరు నాలుగు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు.ఉన్నత చదువుల కోసం రాజా రెడ్డి అమెరికాకు వెళ్లగా.. అక్కడ ప్రియా పరిచయం అయ్యారు. మొదట స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరు ఆపై ప్రేమికులుగా మారారు. రాజా, ప్రియా ప్రేమకు ఇరు కుటుంబసభ్యులు అంగీకారం తెలపడంతో త్వరలోనే ఒక్కటవ్వనున్నారు. అమెరికాలోని డ‌ల్లాస్ యూనివ‌ర్సిటిలో బ్యాచిల‌ర్ ఆండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ కోర్సు రాజా పూర్తి చేశారు. చట్నీస్ అధినేత ప్రసాద్ అట్లూరి మనవరాలే ప్రియా. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రియాకు అమెరికా పౌరసత్వం కూడా ఉంది.