Site icon NTV Telugu

YS Sharmila : రేవంత్ రెడ్డిని కలిసిన వైఎస్‌ షర్మిల

Sharmila

Sharmila

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. విజయవాడలో జరగనున్న మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆమె ముఖ్యమంత్రికి ఆహ్వానం పంపిన సంగతి తెలిసిందే. అయితే.. సోమవారం ఆమె ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను కూడా కలిసి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జయంతి వేడుకలకు హాజరు కావాలని అభ్యర్థించారు. షర్మిల ఆ తర్వాత, ప్రజాభవన్‌లో తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కను కలిశారు. ఆయనను కూడా జయంతి కార్యక్రమానికి ఆహ్వానించారు. జులై 8న విజయవాడలో వైఎస్సార్ 75వ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు షర్మిల తెలిపారు. ఈ వేడుకలకు ఆమె పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఆహ్వానిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కూడా ఆహ్వానించారు.

Exit mobile version