YS Jagan: చంద్రబాబు హయాంలో రెడ్ బుక్ గవర్నెన్స్ గ్లోబల్ అయ్యిందంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. ఏపీ పోలీసులు ఎఫ్‌బీఐగా పోజులిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. పోలీసుల నకిలీ గుర్తింపు ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు అంటూ ఎక్స్‌లో వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
చంద్రబాబు ఇది పోలీసింగ్ నా? రాజకీయ కక్ష సాధింపునకు రాష్ట్ర ప్రాయోజిత మోసమా? ఎక్స్‌లో పోస్టులను తొలగించాలని కోరుతూ.. ఏపీ పోలీసులు తమను అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(FBI)గా అభ్యర్థన పంపటం దారుణమన్నారు. ఈ చర్య రాష్ట్రం, దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. టేక్‌డౌన్ రిక్వెస్ట్ అధికారిక ఏపీ పోలీస్ ఈమెయిల్ నుంచే వచ్చిందని ఎక్స్ ధృవీకరించింది. అయినా.. ఆ అధికారి పంపిన సంస్థ పేరులో మాత్రం ‘FBI’ అని పేర్కొన్నారని గుర్తు చేశారు. ఈ టేక్‌డౌన్ రిక్వెస్ట్‌ను ఎవరు ఆదేశించారు? FBI గుర్తింపును ఎందుకు దుర్వినియోగం చేశారు? ఎక్స్‌ను తప్పుదోవ పట్టించి.. మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు ఇది ఉద్దేశపూర్వక ప్రయత్నమా? నెరవేరని సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలపై ప్రశ్నలు అడిగినందుకా? డీఎస్సీ స్కామ్‌పై ప్రశ్నించినందుకా? అమరావతి దోపిడీపై ప్రశ్నించినందుకా? రాష్ట్ర అప్పులు, పాలనా వైఫల్యాలు, వేధింపులపై ప్రశ్నించినందుకా? అని జగన్ ప్రశ్నించారు.
పోలీస్ యూనిఫాం చట్టాన్ని రక్షించేందుకు ఉండాలని.. రాజకీయ సెన్సార్‌షిప్ అమలు చేసేందుకు కాదని మాజీ సీఎం జగన్ అన్నారు.. “రాజకీయ టేక్‌డౌన్ ఆపరేషన్‌లో విదేశీ దర్యాప్తు సంస్థ పేరును లాగడం ద్వారా ఆంధ్రప్రదేశ్, పోలీస్ వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీశారు. విమర్శకుల గొంతులను అణచివేసేందుకు ఖర్చు చేసే శక్తిని.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల అమలుపై పెట్టాలి. కరవు పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాలి. నిజమైన ఉద్యోగాలు కల్పించడం, అభివృద్ధి చేయడం, ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలి. సోషల్ మీడియా ఉన్న నేపథ్యంలో వాస్తవాలను దాచడం సాధ్యం కాదు. మీ ప్రభుత్వ పనితీరుపై నమ్మకం ఉంటే.. విమర్శలకు పనితీరు, పారదర్శకతతో సమాధానం చెప్పాలి. కానీ.. సెన్సార్‌షిప్, వేధింపులతో కాదు.” అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
𝗨𝗻𝗱𝗲𝗿 @ncbn 𝗚𝗮𝗿𝘂, "𝗥𝗲𝗱 𝗕𝗼𝗼𝗸 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗮𝗻𝗰𝗲" 𝗴𝗼𝗲𝘀 𝗴𝗹𝗼𝗯𝗮𝗹; 𝗻𝗼𝘄 𝗳𝗲𝗮𝘁𝘂𝗿𝗶𝗻𝗴 𝘁𝗵𝗲 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵 𝗣𝗼𝗹𝗶𝗰𝗲 𝗽𝗼𝘀𝗶𝗻𝗴 𝗮𝘀 𝘁𝗵𝗲 𝗙𝗕𝗜! 𝗙𝗮𝗸𝗲 𝗶𝗱𝗲𝗻𝘁𝗶𝘁𝘆, 𝗿𝗲𝗮𝗹 𝘁𝗵𝗿𝗲𝗮𝘁 𝘁𝗼 𝗱𝗲𝗺𝗼𝗰𝗿𝗮𝗰𝘆.
Mr. Chandrababu Naidu Garu, is this policing, or state-sponsored deception aimed at politically motivated harassment?
Your police force identifying themselves as the US Federal Bureau of Investigation while seeking the removal of posts from X is the most deplorable act that tarnishes the reputation of our state and country.
X has confirmed that the takedown request originated from an official Andhra Pradesh Police email address, not the FBI’s! yet the officer names ‘FBI’ as the sender organisation.
Who ordered this takedown request? Why was the FBI’s identity misused? Was it a deliberate attempt to mislead X and silence voices questioning your government on
1.Unfulfilled Super Six and Super Seven promises
2.DSC Scam
3.Amaravati looting
4.State Debt, Governance failures & harassment.The police uniform is meant to protect the law, not to enforce your political censorship. Dragging the name of a foreign investigating agency into a political takedown operation has disgraced Andhra Pradesh and severely damaged the credibility of its police force.
The energy spent trying to muzzle critics should instead be directed to fulfill Super Six and Super Seven promises: Support farmers during these tough drought times, create real jobs, drive development, and address what actually matters to the people of Andhra Pradesh.
Social media makes it impossible to hide behind curated narratives. If this government is confident in its record, it should answer criticism with performance and transparency and not with censorship and harassment.
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 16, 2026

