Site icon NTV Telugu

YS Jagan: నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం.. సర్వత్రా ఆసక్తి!

Ys Jagan

Ys Jagan

ఇవాళ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు మీడియా సమావేశంలో జగన్ పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, అక్రమ కేసులు, సూపర్ సిక్స్ హామీల వైఫల్యాలపై వైసీపీ అధినేత మీడియాతో మాట్లాడనున్నారు. నిన్న పల్నాడు జిల్లా పర్యటన నేపథ్యంలో ఈ మీడియా సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read: Today Astrology: నేటి దినఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!

వైఎస్ జగన్ బుధవారం పల్నాడు జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామ ఉపసర్పంచ్‌ కొర్లకుంట నాగమల్లేశ్వర­రావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. పల్నాడు పర్యటనలో వైఎస్‌ జగన్‌ను అడ్డుకునేందుకు పోలీ­సులు విశ్వప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. జగన్‌కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మారథం పట్టారు. ఓ వైపు పోలీసుల ఆంక్షలు ఉన్నా.. అవేమీ లెక్కచేయకుండా తమ అభిమాన నాయడుకు జగన్‌ కోసం రోడ్లపైకి వచ్చారు. జగన్‌ ఇటీవల పర్యటించిన తెనాలి, పొదిలి, రాప్తాడు పర్యటనలకు కూడా జనాలు భారీగా వచ్చిన విషయం తెలిసిందే.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు బెంగుళూరుకు వెళ్లనున్నారు. గురువారం సాయంత్రం 4.20 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి జగన్ బయలుదేరనున్నారు. 5.40 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరుతారు. రాత్రి 8 గంటలకు బెంగుళూరులోని ఆయన నివాసానికి చేరుకుంటారు.

 

Exit mobile version