NTV Telugu Site icon

YS Jagan Praja Sankalpa Yatra: ప్రజా సంకల్పయాత్రకు ఆరేళ్లు పూర్తి..

Ys Jagan Praja Sankalpa Yat

Ys Jagan Praja Sankalpa Yat

YS Jagan Praja Sankalpa Yatra: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు నేటితో నాలుగేళ్లు పూర్తి అయ్యింది.. ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌.. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు.. వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు.. రైతులు, మహిళలు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాలను కలుస్తూ.. వారి సమస్యలను అధ్యయనం చేస్తూ.. తాను అధికారంలోకి రాగానే వాటి పరిష్కారానికి కృషి చేస్తానంటూ ముందుకు సాగారు వైఎస్‌ జగన్‌.. ప్రజా సంకల్ప పాదయాత్ర.. 2019 ఎన్నికల్లో వైసీపీకి ఘన విజయాన్ని తెచ్చిపెట్టడంలో కీలక భూమిక పోషించిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.. ప్రజా సంకల్పయాత్ర అంటూ ఉక్కు సంకల్పంతో పాదయాత్ర చేసిన వైఎస్‌ జగన్‌ చరిత్ర సృష్టించాడు.. అలాంటి పాదయాత్ర ఇవాళ్టికి ఆరేళ్లు పూర్తి చేసుకుంటుంది.. ఈ రోజును రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరుపుకుంటుంది వైసీపీ.. అధికారంలోకి కూడా రావడంతో.. ఘనంగా ఈ వేడుకలు నిర్వహిస్తోంది..

Read Also: Virat Kohli-Rohit Sharma: విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు.. అతడు మాకు ఎంతో అవసరం: రోహిత్

కాగా, 2017 నవంబర్ 6న కడప జిల్లాలోని ఇడుపులపాయలో ప్రజా సంకల్పయాత్రని ప్రారంభించారు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 13 జిల్లాలను టచ్ చేస్తూ పాదయాత్ర సాగించారు.. 134 నియోజవర్గాల్లో 341 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించారు.. 3,648 కిలోమీటర్లు నడిచారు. 2,516 గ్రామాల గుండా పాదయాత్ర సాగింది. మొత్తం 124 బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమవేశాలు.. ఇంకా ఎందరితో మమేకం అయ్యారు.. దారిలో రైతులను పరామర్శించారు.. పొలాల్లోకి వెళ్లి.. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు.. తమ ప్రభుత్వం వస్తే అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు.. అందుకు అనుగుణంగా.. 2019 ఎన్నికల ముందు నవరత్నాల పేరుతో మేనిఫెస్టో తీసుకొచ్చారు.. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా పార్టీ ప్రణాళికను రూపొందించారు.. ఇక, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని మెజార్టీతో గెలిపించారు ప్రజలు.. అసెంబ్లీలోనే కాదు.. పార్లమెంట్‌ స్థానాల్లోనూ ఆ పార్టీ సత్తా చాటింది.

Read Also: Sunil Narine Retirement: సునీల్ నరైన్ సంచలన నిర్ణయం.. క్రికెట్‌కు వీడ్కోలు! కానీ..

ఇక, తాము ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత 99 శాతం మేర నెరవేర్చామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకుని వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ పనిచేస్తున్నారు.. వై నాట్ 175 అంటూ ముందుకు సాగుతున్నారు.. గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో.. మంత్రులను, ఎమ్మెల్యేలను ప్రజాక్షేత్రం బాట పట్టించిన ఆయన.. ఆ తర్వాత ఏ మాత్రం గ్యాప్‌ ఇవ్వకుండా వరుస కార్యక్రమాలు ఇస్తున్నారు.. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్‌ సిద్ధం చేసుకుంటున్నారు.. తమ ప్రభుత్వ హయాంలో ఏ వర్గాలకు ఎంత మేర లబ్ధి చేకూరిందనే వివరాలను చెబుతూ.. ఈ ప్రభుత్వంలో మీకు లబ్ధి చేకూరినట్టు అనిపిస్తేనే.. నాకు ఓటు వేయండి.. మరోసారి అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. ఇక, ప్రజా సంకల్పయాత్ర ఆరేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంతో సెలబ్రేషన్స్‌ నిర్వహిస్తున్నారు.. ప్రతీ నియోజకవర్గంలో వైఎస్సార్‌ విగ్రహాలకు పూలమాలలేసి ఘనంగా నివాళులు అర్పించడం, సర్వమత ప్రార్ధనలు, కేక్ కటింగ్‌లు ఇలా వివిధ కార్యక్రమాలను ప్లాన్‌ చేశాయి వైసీపీ శ్రేణులు.