YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ విజయవాడకు రానున్నారు. భవానీపురం జోజీ నగర్‌లోని 42 ఫ్లాట్ల బాధితులను స్వయంగా కలిసి పరామర్శించేందుకు ఆయన పర్యటన ఖరారైంది. ఇటీవల తమ ఇళ్లను కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన బాధితుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు జగన్ ఈ సందర్శన చేపడుతున్నారు. పర్యటన షెడ్యూల్ ప్రకారం, వైఎస్ జగన్ ఉదయం 10 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి నేరుగా భవానీపురం బయలుదేరి 12.50 గంటలకు జోజీ నగర్‌కు చేరుకుంటారు. అక్కడ ఇళ్లను కోల్పోయిన 42 మంది బాధితులను కలుసుకుని వారి బాధలు, నష్టాలపై వివరాలు వింటారు.
Python Spotted in Drainage: డ్రైనేజీలో భారీ కొండ చిలువ.. పరుగులు తీసిన స్థానికులు
ఇప్పటికే పలువురు బాధితులు జగన్‌ను కలిసి తమకు జరిగిన అన్యాయం, ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఆ సమయంలో స్వయంగా వచ్చి పరిస్థితిని పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే ఈ రోజు భవానీపురం జోజీ నగర్‌కు వెళ్లి ప్రత్యక్షంగా పరిస్థితిని సమీక్షించనున్నారు. బాధితులతో పరామర్శ పూర్తయ్యాక వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నట్లు సమాచారం.
RowdyJanardhana : విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన’ టీజర్ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే?
