Site icon NTV Telugu

YS Jagan: చంద్రబాబు గారూ.. ఒక్క దీపం అయినా వెలిగిందా?

Ys Jagan Chandrababu

Ys Jagan Chandrababu

దీపావళి పండగ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాల్సింది పోయి.. చీకటి నింపుతున్నారంటూ ఎక్స్‌లో వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. చంద్రబాబు గారూ.. మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తామన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? అని విమర్శించారు. స్కూళ్లు, ఆస్పత్రులు, విద్యా, వైద్యం, వ్యవసాయం, లా అండ్‌ ఆర్డర్‌, పారదర్శకత.. వెలగని దీపాలే కదా? అని జగన్ ఎద్దేవా చేశారు.

1. నిరుద్యోగులందరికీ నెలకు రూ.3వేల చొప్పున భృతి
2. ప్రతి అక్కా చెల్లెమ్మకూ నెల నెలా రూ.1500, సంవత్సరానికి రూ.18,000
3. 50 ఏళ్లకే పెన్షన్‌, నెల నెలా రూ.4వేలు.
4. ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20,000, పీఎం కిసాన్‌ కాకుండా ఇస్తానంటూ మీరు ఇచ్చిన మాట
5. ఎంతమంది పిల్లలు ఉన్నా, ఆ పిల్లలందరికీ, ప్రతి ఒక్కరికీ ఏటా రూ.15,000
6. ప్రతి ఇంటికీ ఏటా 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, ఈ రెండేళ్లలో 6 సిలిండర్లు
7. అక్క చెల్లెమ్మలందరికీ ఎక్కడికైనా, ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం
8. ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు

Also Read: YCP ZPTC Murder: వైసీపీ జెడ్పీటీసీ వారా నూకరాజు దారుణ హత్య!

ఇవన్నీ వెలగని దీపాలో.. లేక చేశాం అంటే చేశాం అన్నట్టుగా వెలిగించిన అరకొర దీపాలా..? లేక మీరు రాకముందు వరకూ దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పడమా?. వీటితో పాటు స్కూళ్లు, ఆస్పత్రులు, విద్యా, వైద్యం, వ్యవసాయం, లా అండ్‌ ఆర్డర్‌, పారదర్శకత ఇవన్నీకూడా వెలగని దీపాలే కదా. మా వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో 2019-24 మధ్య ఇంటింటికీ అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు.. ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులు అంటూ ఎక్స్‌లో వైఎస్ జగన్ రాసుకొచ్చారు.

Exit mobile version