Site icon NTV Telugu

YS Jagan: ఇళ్ల కూల్చివేతలపై సీబీఐ విచారణ జరిపించాలి..!

Jagan

Jagan

YS Jagan: విజయవాడ భవానీపురంలో వైఎస్ జగన్ పర్యటించారు. భవానీపురంలోని జోజీనగర్ లో 42 ప్లాట్ల బాధితులను ఆయన పరామర్శించారు. భవానీపురంలో ఇటీవల ఇళ్లను కోల్పోయిన 42 కుటుంబాల తరుపున ఆయన అనేక విషయాలను ప్రస్తావించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉందని.. ఈనెల 31వ తేదీ వరకు 42 కుటుంబాలకు సుప్రీం కోర్టు ఊరట ఇచ్చిందన్నారు. అయితే పోలీసులు ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఇళ్లను కూల్చేశారని.. 31వ తేదీ వరకు గడువు ఉన్నా అధికార దుర్వినియోగం చేసారని మండిపడ్డారు. ఇళ్లు కూల్చేసి 42 కుటుంబాలను రోడ్డుపాలు చేశారన్నారు. 2.17 ఎకరాల విలువ రూ.150కోట్లు పైగా ఉంటుందని.. 42 కుటుంబాలు 25ఏళ్లుగా ఇక్కడే ఇళ్లు కట్టుకుని ఉంటున్నాయని, వాళ్ల ఇళ్లను ధ్వంసం చేసారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

TGTET 2026: టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. జనవరి 3 నుంచి ఆన్లైన్ పరీక్షలు..

2016లో 1981 డేట్ తో తప్పుడు డాక్యుమెంట్లతో తప్పుడు సొసైటీ క్రియేట్ చేసారని.. 2.17 ఎకరాలు కాజేసేందుకు కుట్ర చేశారన్నారు. ఇందులో లోకేష్, కేశినేని చిన్ని, జనసేన కార్పొరేటర్ సోదరుడు ఇన్వాల్వ్ అయ్యారంటూ.. ఈ ఇళ్లకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి ఉందని తెలిపారు. బ్యాంకులు ఇళ్లు కట్టుకునేందుకు వీళ్లకు లోన్లు కూడా ఇచ్చాయని, స్థలం ఇంకొకరిదే అయితే రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందని, అలాగే స్థలం ఇంకొకరిదే అయితే కరెంట్, డ్రైనేజ్ పర్మిషన్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. బాధితులకు న్యాయం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని.. ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు ఇచ్చి జేసీబీలతో ఇళ్లు కూల్చేస్తారా..? స్థలం క్రమవిక్రయాలు జరిగే సమయంలో అభ్యంతరాలు ఉంటే చెప్పమని పేపర్ ప్రకటనలు కూడా ఇచ్చారన్నారు. అయితే అప్పుడు ఎవరూ అభ్యంతరాలు చెప్పలేదు. చంద్రబాబు, లోకేష్, కేశినేని చిన్ని, జనసేన కార్పొరేటర్ అంతా ఒక్కటై కుట్ర చేసారని జగన్ అన్నారు.

Pawan Kalyan : OG డైరెక్టర్ సుజిత్ కు పవర్ స్టార్ ఖరీదైన గిఫ్ట్

అన్యాయంగా పేదల ఇళ్లను కూల్చేశారని.. భవానీపురంలోనే కాదు ఇలాంటి అన్యాయాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయని జగన్ తెలిపారు. లిటికేషన్ ఉన్న భూములను అధికార పార్టీ నేతలే కబ్జా చేయిస్తున్నారని.. కొన్ని చోట్ల అధికార పార్టీ వాళ్లే లిటికేషన్ క్రియేట్ చేస్తున్నారని జగన్ మాట్లాడారు. భవానీపురం ఇళ్ల కూల్చివేతలపై సీబీఐ విచారణ జరిపించాలని.. ఫేక్ సొసైటీ క్రియేట్ చేసి పేద ప్రజల ఆస్తులపై ఎలా కన్నేశారో తేలాలని వైఎస్ జగన్ కోరారు.

Exit mobile version