YS Jagan: కురుపాం గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాలలలో పచ్చకామెర్లకు గురైన బాలికలను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH) పిల్లల వార్డుకు వెళ్లారు. అక్కడ జగన్ చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించి, వారికి ధైర్యం చెబుతూ భరోసా కల్పించారు. బాలికల ఆరోగ్య పరిస్థితి, చికిత్స విధానం గురించి వైద్యులతో వివరాలు తెలుసుకున్నారు.
Hyderabad Drugs: రూటు మార్చిన డ్రగ్ స్మగ్లర్లు.. కొంపలోనే కుంపటి పెట్టారు!
ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కేజీహెచ్‌లో 65 మంది చిన్నారులు పచ్చకామెర్లతో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కురుపాంలో బాలికలు అస్వస్థత చెందితే విశాఖకు రావాల్సిన పరిస్థితి రాష్ట్ర వైఫల్యానికి నిదర్శనం అని విమర్శించారు. జగన్ మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని, అలాగే చికిత్స పొందుతున్న ప్రతి బాలికకు లక్ష పరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ ఘటనపై న్యాయపోరాటం చేస్తామని, బాధిత బాలికల తరఫున మెడికో లీగల్ కేసులు వేస్తామని చెప్పారు.
Couple’s Romance in Temple: మరీ ఇలా మోపయ్యారేంట్రా.. అది గుడా.. ఇంకేమన్నానా..
వాటర్ సమస్య కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలిసిందని పేర్కొంటూ, ఆర్వో ప్లాంట్‌ను యుద్ధప్రాతిపదికన రిపేర్ చేసి మళ్లీ ఉపయోగంలోకి తేవాలని సూచించారు. అలాగే బాలికల ఆశ్రమ పాఠశాలల్లో వసతులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని జగన్ పేర్కొన్నారు.
