Site icon NTV Telugu

YS Jagan: నేడు నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..!

Jagan

Jagan

YS Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ విరామం తర్వాత నేడు (గురువారం) హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా, ఆయన చాలా సంవత్సరాల తర్వాత వ్యక్తిగతంగా కోర్టు మెట్లెక్కడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఆరేళ్లుగా ముఖ్యమంత్రి హోదాలో ఉండటం, ఇతర కారణాల రీత్యా కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందుతూ వచ్చిన జగన్‌కు ఈసారి సీబీఐ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది. ప్రస్తుతం ఈ కేసుల్లోని డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున నిందితులు భౌతికంగా హాజరుకావాల్సిందేనని సీబీఐ వాదించడంతో, న్యాయస్థానం ఆయన మినహాయింపు పిటిషన్‌ను తిరస్కరించి, నవంబర్ 21లోగా హాజరుకావాలని ఆదేశించింది.

Nitish Kumar: నేడు సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం.. కొలువుదీరనున్న ఎన్డీయే సర్కార్..

ఈ నేపథ్యంలో జగన్ తన పర్యటనను పక్కాగా షెడ్యూల్ చేసుకున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, గన్నవరం విమానాశ్రయం మీదుగా 10:45 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా 11:30 గంటలకు నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు. కోర్టు విచారణ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 12:55 గంటల సమయంలో లోటస్ పాండ్‌లోని తన నివాసానికి వెళ్తారు. అక్కడ స్వల్ప విరామం తర్వాత తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని సాయంత్రం 3:40 గంటలకల్లా బెంగళూరులోని తన నివాసానికి చేరుకునేలా ప్రణాళిక రూపొందించుకున్నారు.

Upasana : మీ కామెంట్స్ కు థాంక్స్.. ట్రోలింగ్ పై ఉపాసన రియాక్ట్

Exit mobile version