Site icon NTV Telugu

YS Jagan: కోర్టులో హాజరైన జగన్.. ముగిసిన విచారణ..!

Jagan

Jagan

YS Jagan: ఆస్తులకు సంబంధించిన కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. నిర్దేశించిన సమయానికి కోర్టుకు చేరుకున్న జగన్, కోర్టు హాల్‌లో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నారు. కోర్టు ప్రక్రియ ప్రకారం ఆయన హాజరు అయినట్టు రికార్డులో నమోదు చేయగా, అనంతరం విచారణను ముగించారు.

Nitish Kumar: బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం.. హాజరైన ప్రధాని మోడీ..

కోర్టు హాజరు పూర్తి చేసిన తర్వాత.. జగన్ కోర్టు ప్రాంగణం నుంచి బయలుదేరి బంజారాహిల్స్‌లోని లోటస్ పాండ్‌ వద్ద తన నివాసానికి బయలుదేరారు. ఇక కోర్టు నుండి జగన్ ఇంటి వరకు రోడ్డు వెంబడి ఆయన అభిమానులు హాజరయ్యారు. కేసుకు సంబంధించిన తదుపరి కార్యక్రమాల వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

1.5K AMOLED డిస్ప్లే, 50MP కెమెరా, Super Anti-Drop డైమండ్ సపోర్ట్‌తో Lava AGNI 4 లాంచ్..!

Exit mobile version