YS Avinash Reddy: 2019లో ఏ విధంగా ఆదరించారో.. 2024లో కూడా అదే విధంగా ఆదరించాలి.. సంక్షేమ రాజ్యాన్ని ముందుకు సాగించేలా ప్రజలు దీవించాలి అన్నారు కడప లోక్‌సభ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి.. పులివెందులలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాల జగనన్న పాలనలో పులివెందుల ఎంతో అభివృద్ధి చెందింది.. నాలుగు సార్లు సీబీఆర్ కు ఫుల్ కెపాసిటీ నీటిని నింపారని తెలిపారు. చంద్రబాబు పులివెందులకు వచ్చి పోయిన తర్వాత వర్షం లేకుండా పోయిందన్న ఆయన.. ఈ 16 నెలల కరువు కాలంలో లింగాల, పీబీసీ కాలుల ద్వారా అరటి రైతులకు నీళ్లు ఇచ్చాం అని గుర్తుచేశారు. 2014 నుంచి 2019 వరకు జిల్లా యంత్రాంగానికి 750 కోట్ల రూపాయలు వ్యవసాయ భీమా వస్తే, జగనన్న ప్రభుత్వంలో 2019 నుంచి 24 మధ్యలో 1900 కోట్లు పంటలు బీమా మంజూరు అయ్యిందన్నారు.
Read Also: Priyanka Gandhi : జైలుకు వెళ్లకుండా ఉండేందుకు కేరళ సీఎం బీజేపీతో రాజీపడ్డారు : ప్రియాంక గాంధీ
వైసీపీ అభివృద్ధి చేస్తూ ఉంటే, ప్రతిపక్షాలు చేసేది లేక గుంపులు కట్టుకొని వస్తున్నారని ఎద్దేవా చేశారు అవినాష్ రెడ్డి. చంద్రబాబుతో పాటు, ప్యాకెట్ స్టార్, బీజేపీ, పరోక్షంగా కాంగ్రెస్ ఎందరు కలిసి వచ్చిన జగన్ ను టచ్ చేయలేరని స్పష్టం చేశారు. 2019లో వైసీపీని ఏ విధంగా ఆదరించారో 2024లో కూడా అదే విధంగా ఆదరించాలి… సంక్షేమ రాజ్యాన్ని ముందుకు సాగించేలా ప్రజలు దీవించాలని కోరారు. ఇక, సీఎం వైఎస్ జగన్‌కు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు. ఎంత మంది కలిసివచ్చినా.. ఎన్ని హామీలు ఇచ్చినా ఏమీ చేయలేరన్నారు. ఒక అబద్ధాన్ని వంద సార్లు చెబితే అది నిజమవుతుందనేది చంద్రబాబు సిద్ధాంతం.. వాళ్ల ట్రాప్‌లో పడవద్దు అని విజ్ఞప్తి చేశారు కడప ఎంపీ, వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి.