NTV Telugu Site icon

Shanmukh Jaswanth: డ్ర‌గ్స్ కేసులో అరెస్టైన షణ్ముఖ్ జస్వంత్‌కు బెయిల్!

Pawan Kalyan

Pawan Kalyan

Shanmukh Jaswanth Gets Bail Today: ప్రముఖ యూట్యూబర్, బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్ జస్వంత్‌కు ఊరట లభించింది. గురువారం డ్ర‌గ్స్ కేసులో అరెస్టైన షణ్ముఖ్‌కు శుక్రవారం బెయిల్ మంజూరు అయింది. జస్వంత్‌ తరపున న్యాయవాది క‌ల్యాణ్ దిలీప్ సుంకర బెయిల్ అప్లై చేసి.. ఆయనను బయటకు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని న్యాయవాది దిలీప్ సుంకర ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. న్యాయవాది దిలీప్ షేర్ చేసిన ఫొటోలో ష‌ణ్ముఖ్ ఉన్నాడు. షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

విశాఖపట్నానికి చెందిన సంపత్‌ వినయ్‌ (31) యూట్యూబ్‌ వీడియోలు చేస్తుంటాడు. అతడు షణ్ముఖ్‌ జశ్వంత్‌కు సోదరుడు. షణ్ముఖ్‌, సంపత్ కలిసి నగర శివారు పుప్పాలగూడలో ఉంటున్నారు. విశాఖకు చెందిన వైద్యురాలు మౌనికతో షణ్ముఖ్‌కు పరిచయముంది. అతడి ద్వారా 2015లో ఆమెకు సంపత్‌ పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. సంపత్‌, మౌనికకు నిశ్చితార్థం కూడా జరిగింది. గత ఏడాది డిసెంబరులో వివాహం చేసుకుందామనుకోగా.. యువతి తల్లి అనారోగ్యం కారణంగా పెళ్లి వాయిదా పడింది. ఫిబ్రవరి 24న పెళ్లి తేదీ నిర్ణయించారు.

Also Read: Akash Deep: ఆకాష్‌ దీప్‌ను వెంటాడిన దురదృష్టం.. క్లీన్‌ బౌల్డ్‌ చేసినా దక్కని వికెట్! వీడియో వైరల్

పలు కారణాలతో వైద్యురాలు మౌనికను సంపత్‌ వినయ్ దూరం పెట్టాడు. ఫిబ్రవరి 27న మరో యువతితో సంపత్‌కు వివాహం చేస్తున్నామని అతడి తల్లిదండ్రులు యువతికి చెప్పారు. తాను మోసపోయానని గుర్తించిన యువతి.. గురువారం నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంపత్ ఫ్లాట్‌కు పోలీసులు వెళ్లారు. ఫ్లాట్‌లో తనిఖీలు చేస్తుండగా.. షణ్ముఖ్‌ గంజాయితో దొరికాడు. వెంటనే అతన్ని డ్ర‌గ్స్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. షణ్ముఖ్‌ తరుపున న్యాయవాది దిలీప్ సుంకర కేసు వాదిస్తున్నారు. నేడు షణ్ముఖ్‌కు బెయిల్ వచ్చింది. ఈ కేసులో షణ్ముఖ్‌కు ఎలాంటి సంబంధం లేదని దిలీప్ అంటున్నారు. అయితే షణ్ముఖ్‌కు జరిపిన వైద్య పరీక్షల్లో అతడు గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ జరిగినట్లు తెలుస్తోంది.

Show comments