Site icon NTV Telugu

Shanmukh Jaswanth: గంజాయితో పట్టుబడ్డ ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్.. అన్న కోసం వెళ్తే అడ్డంగా దొరికిపోయాడు!

Pawan Kalyan (2)

Pawan Kalyan (2)

YouTuber Shanmukh Jaswanth Arrested in Drugs Case: ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ 5 రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయితో పట్టుపడ్డాడు. ఇంట్లో గంజాయి తీసుకుంటుండగా.. షణ్ముఖ్‌ను పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్ కేసులో అతడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. షణ్ముఖ్‌తో పాటు అతడి సోదరుడు సంపత్ వినయ్‌ని కూడా మరో కేసులో అరెస్ట్ చేశారు. అన్న కోసం వెళితే.. తమ్ముడు పోలీసులకు చిక్కడం ఇక్కడ విశేషం. షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది తొలిసారి కాదు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో అరెస్టు అయ్యి విడుదలయ్యాడు.

విషయంలోకి వెళితే… డాక్టర్ అయిన మౌనిక అనే యువతిని తాను పెళ్లి చేసుకుంటానని షణ్ముఖ్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్‌ మాట ఇచ్చాడు. అయితే మౌనికను మోసం చేసి.. ఆరు రోజుల్లో పెళ్లి ఉండగా మరో అమ్మాయిని సంపత్ వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసిన మౌనిక.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సంపత్‌ను ప్రశ్నించేందుకు అతడి ఫ్లాట్‌కు వెళ్లారు. అక్కడ షణ్ముఖ్ డ్రగ్ తీసుకుంటూ దొరికిపోయాడు. ఇది చూసి పోలీసులు షాక్ అయ్యారు.

Also Read: IPL 2024 Schedule: నేడు ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. చెపాక్ స్టేడియంలో తొలి మ్యాచ్‌!

షణ్ముఖ్, సంపత్‌లను మౌనిక వీడియో తీస్తుండగా.. డ్రగ్స్ మత్తులో ఉన్న యూట్యూబర్ (షణ్ముఖ్ జస్వంత్) వీడియో తీయోద్దంటూ గొడవ చేశాడు. దాంతో అన్నా, తమ్ముడు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేసి.. వేర్వేరు కేసులు నమోదు చేశారు. షణ్ముఖ్‌పై డ్రగ్స్ కేసు, సంపత్‌పై చీటింగ్ కేసు పెట్టినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన ఫాన్స్.. షణ్ముఖ్‌పై మండిపడుతున్నారు.

Exit mobile version