NTV Telugu Site icon

Peacock Curry: నెమలి మాంసం అంటూ యూట్యూబ్ లో వీడియో.. చివరికి యూట్యూబర్ పై.?

Peacock

Peacock

Peacock Curry: తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన ప్రణయ్ కుమార్ అనే యూట్యూబర్ ‘నెమలి కూర’ తయారీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిక్కుల్లో పడ్డాడు. ఈ వైరల్ వీడియో అక్రమ వన్యప్రాణుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలపై ఆగ్రహం చెందారు నెటిజన్స్. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కుమార్‌ పై పోలీసులు విచారణ చేపట్టారు. అభియోగాలు ఎదుర్కొంటున్న అతనిని అటవీ శాఖ ఆదివారం నాడు కుమార్‌ ను అరెస్టు చేసి ‘నెమలి కూర’ వండిన ప్రాంతాన్ని పరిశీలించింది. వీడియో ప్రచారం చేయడమే కాకుండా ఈ రక్షిత జాతిని చంపడం కూడా జరిగిందని కూడా అధికారులు ఆరోపిస్తున్నారు.

Google pay : గూగుల్‌ పేలో పేమెంట్‌ హిస్టరీ డిలీట్‌ ఎలా చేయాలంటే ?

అటవీ అధికారులు వీడియో యొక్క ప్రామాణికతను తనిఖీ చేస్తున్నారు. అలాగే ఫోరెన్సిక్ పరీక్ష కోసం నమూనాలను సేకరించారు. సంబంధిత చట్టం ప్రకారం.. కోడం ప్రణయ్ కుమార్‌ పై కేసు నమోదు చేసినట్లు సిరిసిల్ల పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) అఖిల్ మహాజన్ తెలిపారు. దీనితో పాటు అతనితో పాటు ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారు. ఆదివారం నాడు ప్రణయ్‌ కుమార్‌ ను అదుపులోకి తీసుకున్న అటవీశాఖ వారు కూరలు వండి వీడియో చిత్రీకరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రణయ్‌ బ్లూమ్‌ శాంపిల్‌, మిగిలిపోయిన కూరను పరీక్షలకు పంపామని, పరీక్షలో నెమలి మాంసమని నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Show comments