NTV Telugu Site icon

Rohit Sharma Birthday: రో.. ఈ ఏడాది నీ కలలు నిజమవుతాయి: రితికా సజ్దే

Rohit Sharma, Ritika Sajdeh

Rohit Sharma, Ritika Sajdeh

Ritika Sajdeh Birthday Wishesh to Rohit Sharma: టీమిండియా కెప్టెన్, హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ నేడు 37వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా రోహిత్‌కు అభిమానులు, క్రికెటర్లు, సెలబ్రెటీలు బర్త్‌ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో రోహిత్ సతీమణి రితికా సజ్దే ప్రత్యేక విషెష్ చెప్పారు. ‘నా అభిమాన అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది నీ కలలు నిజమవుతాయి’ అని రితికా పేర్కొన్నారు. రోహిత్, సమైరాలతో తాను ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో రితికా షేర్ చేశారు. ప్రస్తుతం ‘హ్యాపీ బర్త్‌ డే రోహిత్ శర్మ’’అనే హ్యష్‌ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.

‘నా అభిమాన అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఈ ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చారు. నిన్ను తెలుసుకోవడం అంటే.. నిన్ను ప్రేమించడమే. ఈ సంవత్సరం నీ జీవితంలో మరింత సంతోషకరంగా ఉండాలని కోరుకుంటున్నా. ప్రేమ, అదృష్టంతో ఈ ఏడాది నీ కలలు నిజమవుతాయి. దేవతలు కలిసి వచ్చి నువ్ కోరుకునే ప్రతిదాన్ని ఇస్తారు. లవ్ యూ రో’ అని రితికా సజ్దే పేర్కొన్నారు. రోహిత్ తల్లి పూర్ణిమ శర్మ ఇన్‌స్టాలో ఓ పోస్టు చేశారు. హిట్‌మ్యాన్‌ టీనేజ్‌లో ఉన్నప్పుడు అతడితో కలిసి దిగిన ఫొటోను ఆమె పోస్ట్ చేసి బర్త్‌ డే విషెష్ చెప్పారు.

Also Read: Rohit Sharma Birthday: రోహిత్ శర్మ పూర్తి పేరు, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌ ఏంటో తెలుసా?

భారత్ తరఫున రోహిత్ శర్మ 59 టెస్టులు, 262 వన్డేలు, 151 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 18 వేలకు పైగా రన్స్ చేశాడు. రోహిత్ సారథ్యంలో తృటిలో వన్డే ప్రపంచకప్ 2023 మిస్ అయింది. మరో నెలలో టీ20 ప్రపంచకప్ 2024 ఉంది. రోహిత్ టీ20 ప్రపంచకప్ గెలవాలని అందరూ కోరుకుంటున్నారు. రోహిత్ కల ప్రపంచకప్ గెలవడం. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది నీ కలలు నిజమవుతాయని రితికా సజ్దే ట్వీట్ చేశారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ 2024లో రోహిత్ ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడి.. 160.31 స్ట్రెక్‌రేట్‌తో 311 పరుగులు చేశాడు. నేడు లక్నోతో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి రోహిత్‌కు బర్త్‌ డే గిప్ట్ ఇవ్వాలని ముంబై ఆటగాళ్లు భావిస్తున్నారు.

Show comments