Site icon NTV Telugu

Medak: మొబైల్ లో గేమ్స్ ఆడొద్దు అన్నందుకు యువతి షాకింగ్ డెసిషన్

Young Girl

Young Girl

ఇటీవలి కాలంలో యువతీ యువకులు చిన్న చిన్న కారణాలకే క్షణికావేశంలో దారుణాలకు ఒడిగడుతున్నారు. చదువులో రాణించడం లేదని, జాబ్ రావడం లేదని, లవ్ ఫెయిల్ అయ్యిందని, తల్లిదండ్రులు మందలించారని ఇలా రకరకాల కారణాలతో తనువులు చాలిస్తున్నారు. తాజాగా మెదక్ జిల్లా హావేలిఘనపూర్ (మం) ముత్తాయిపల్లిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మొబైల్ లో గేమ్స్ ఆడొద్దని తల్లిదండ్రులు మందలించినందుకు 19 ఏళ్ల యువతి షాకింగ్ డెసిషన్ తీసుకుంది.

Also Read:Tamil Nadu: స్టాలిన్ సర్కార్‌కు గవర్నర్ షాక్.. ప్రసంగించకుండా అసెంబ్లీ నుంచి వాకౌట్

కొన్ని రోజులుగా ఫోన్లో గేమ్స్ కి బానిసైన శిరీష(19). తరచు మొబైల్ వాడొద్దని హెచ్చరించినప్పటికీ తీరు మార్చుకోకపోవడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోయింది. కూతురి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Exit mobile version