పల్నాడు జిల్లాలో ఓయువతి ప్రాణం తీసింది న్యూడ్ వీడియో. నరసరావుపేట మండలం పమిడిమర్రు ఎస్సీ కాలనీకి చెందిన మురికిపూడి సిఫారా(23)ఎలుకల మందు త్రాగి మృతి చెందింది. ఈ నెల 8న ఎలుకల మందు తిని ఆ విషయం ఎవ్వరికి చెప్పకుండా ఇంట్లోనే ఉన్నది సిఫార. ఆరోగ్యం క్షీణిస్తుండడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కాగా సిఫారకి అదే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో తరచూ నాగరాజుకు తన న్యూడ్ సెల్ఫీ వీడియోలను సిఫార పంపించేది.
Also Read:Bollywood : జాన్వీ, ఖుషీ కపూర్ కు పోటీగా మరో కపూర్ కూతురు
ఇక్కడే అసలు ఇబ్బందులు తలెత్తాయి. నాగరాజుకు పార్వతి అనే మరో మహిళతో అక్రమసంబంధం ఉంది. నాగరాజు కోసం సిఫార, పార్వతి మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో నాగరాజు వద్ద ఉన్న సిఫార న్యూడ్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది పార్వతి. న్యూడ్ వీడియోలు బయటికి రావడంతో మనస్తాపం చెంది ఎలుకల ముందు తాగి ఆత్మహత్య చేసుకుంది సిఫారా. తమకు న్యాయం చేయాలని హాస్పిటల్ వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు.