ఆకస్మాత్తుగా జరిగే సంఘటనలు జీవితాలను తలకిందులు చేస్తాయి. 9 నెలల క్రితం పెళ్లైన ఓ యువతి లైఫ్ లో అనుకోకుండా జరిగిన సంఘటన జీవితమే లేకుండా చేసింది. పెళ్లై ఏడాది గడవక ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. బైక్ పై వెళ్తుండగా మెడకు ఉన్న చున్ని వెనక చక్రంలో చిక్కుకోవడంతో యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన అనకాపల్లిలో జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read:Pakistan: భారత్ యుద్ధానికి సిద్ధమవుతోంది.. ధీటుగా ఎదుర్కొంటామన్న పాక్ మంత్రి
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా కేసనకుర్రుకు చెందిన కళ్యాణపు రామదుర్గ (28)కు కోనసీమ జిల్లా పోలవరానికి చెందిన విన్నకోట మోహన్‌కృష్ణతో 9 నెలల క్రితం పెళ్లి జరిగింది. ఇటీవలె మోహన్‌కృష్ణకు అచ్యుతాపురం సెజ్‌లో ఉద్యోగం వచ్చింది. దీంతో ఆ యువతి ఎంతో సంతోషించింది. కానీ ఆ సంతోషం కొన్ని రోజులే అని ఊహించలేకపోయింది. విధి ఆడిన వింత నాటకంలో అసువులు బాసింది.
Also Read:Appanna Temple Incident : అప్పన్న సన్నిధిలో అపశృతి.. గోడకూలి ఏడుగురు మృతి
సోమవారం రామదుర్గకు చెవి నొప్పిగా ఉండటంతో రాత్రి 7 గంటలకు భర్త ఆమెను తీసుకుని ఆసుపత్రికి బయలుదేరారు. కొంత దూరం వచ్చాక రామదుర్గ వేసుకున్న చున్నీ బైక్ వెనుకచక్రంలో పడి మెడకు చుట్టుకుపోయింది. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆమెను చున్నీ కత్తిరించి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు యువతి అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అత్తగారింట్లో సుఖ సంతోషాలతో తమ కూతురు జీవిస్తుందని భావించిన తల్లిదండ్రులు ఆమె మృతితో కుప్పకూలిపోయారు. తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
