Site icon NTV Telugu

Kollywood : సన్ రైజర్స్ ఓనర్ తో యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ప్రేమాయణం?

Ani Kavya

Ani Kavya

స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచంద్రన్ నిత్యం ఏదో ఒక లవ్ మ్యాటర్‌లో నానుతూనే ఉన్నాడు. మొన్నటికి మొన్న ప్రముఖ వ్యాపార వేత్త.. ఐపీఎల్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ అధినేత కావ్య మారన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు రాగా, వెంటనే స్పందించాడు అని. మ్యారేజా? చిల్ అవుట్ గాయిస్.. ప్లీజ్ స్టాప్ స్ప్రెడ్డింగ్ రూమర్స్ అంటూ క్లారిటీ ఇచ్చాడు.

Also Read : MEGA158 : చిరు – బాబీ సినిమా డీఓపీగా తప్పుకున్న మిరాయ్ దర్శకుడు

ఈ రూమర్ వచ్చి ఆరు నెలలైనా కాలేదు.. కావ్య మారన్‌తో ఫారెన్‌లో చక్కర్లు కొడుతూ కెమెరా కంటికి చిక్కేశాడు అనిరుధ్. న్యూయార్క్ వీధుల్లో కావ్య- అని కలిసి షికార్లు చేస్తున్న వీడియో రావడంతో నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ఇష్క్ కాదంటూనే చక్కర్లు కొట్టడాన్ని ఏమంటారో అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే గతంలో సింగర్ జోనితా గాంధీతో లవ్ ట్రాక్ నడుపుతున్నాడంటూ వార్తలు రాగా.. అనిని సీఎస్కే నుండి ఎస్ఆర్‌హెచ్ కొనుగోలు చేసిదంటూ సెటైర్స్ పేలుస్తున్నారు.  చెన్నై స్టార్ కంపోజర్ అనిరుధ్‌పై డేటింగ్ రూమర్స్ రావడం ఇదేమీ కొత్త కాదు. గతంలో నటి ఆండ్రియాతో లవ్ ట్రాక్ నడిపాడంటూ వార్తలొచ్చాయి. వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు లీక్ అయ్యి వైరల్ అయ్యాయి. తర్వాత ఆ ఇద్దరూ విడిపోయారు. కీర్తి సురేష్‌తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ మహానటి చిరకాల బాయ్ ఫ్రెండ్‌తో ఏడడుగులు వేసేసరికి రూమర్ అని తేలిపోయింది. అలాగే జోనితా గాంధీతో లవ్ ట్రాక్ నడుపుతున్నాడని గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కావ్య మారన్‌తో రిలేషన్ ఎప్పుడూ చర్చకు వస్తూనే ఉంది.

Exit mobile version