NTV Telugu Site icon

Karnataka: స్కూటర్ రిపేర్ చేయలేదని ఓలా షోరూంను పెట్రోల్ పోసి తగలబెట్టిన యువకుడు..

Ola

Ola

కర్ణాటకలోని కలబురగిలో నుంచి ఓ ఆశ్చర్యకరమైన వార్త బయటకు వచ్చింది. హుమ్నాబాద్‌ రోడ్డులోని బైక్‌ షోరూమ్‌లో మంటలు చెలరేగాయి. మంటలు చాలా తీవ్రంగా ఉండటంతో భారీ నష్టం వాటిల్లింది. అక్కడ ఉన్న బైక్‌లన్నీ దగ్ధమయ్యాయి. సమాచారం మేరకు నిన్న తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నిందితుడు నదీమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

READ MORE: Rahul Gandhi: రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూ మద్దతు..

అసలు విషయం తెలిసిన పోలీసులు కంగుతిన్నారు. అసలేం జరిగిందంటే.. 20 రోజుల క్రితం ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ను నదీమ్(26) అనే యువకుడు కొనుగోలు చేశాడు. ఆ బైక్‌లో ఏదో లోపం ఏర్పడింది. రిపేర్ కోసం మహ్మద్ నదీమ్ ప్రతిరోజూ బైక్‌ను షోరూమ్‌కు తిరుగుతున్నాడు. మంగళవారం నదీమ్ తన బైక్‌ను తీసుకురాగా.. ఆగ్రహానికి గురై, షోరూంకు నిప్పంటించాడు. ఈ ఘటనలో దాదాపు 6 స్కూటర్లు దహనమయ్యాయి. ఘటన తర్వాత నదీమ్ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి షోరూంకు తానే నిప్పు పెట్టాడని చెప్పాడు. మూడు రోజుల క్రితం తన బైక్ లో లోపం తలెత్తిందని.. షోరూం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఉదయం పెట్రోల్‌ పోసి తగుల బెట్టినట్లు ఒప్పుడకున్నాడు. కాగా.. ఓలాకు చెందిన ఇలాంటి వార్తలు తరచూ బయటకు వస్తూనే ఉంటాయి.

Show comments