NTV Telugu Site icon

Hyderabad: గ్రీన్ బావర్చిలో బిర్యాని తిని ఆస్పత్రి పాలైన యువకుడు.. ఏం కలిపారంటే?

Biryani

Biryani

బయట ఏం తిన్నాలన్న ఒకటికి వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం ప్రతీ దాంట్లో కల్తీ జరుగుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా నేరేడ్మెట్ గ్రీన్ బావర్చిలో బిర్యాని తిని.. వాంతులు విరేచనాలతో హాస్పిటల్లో చేరినట్లు రవి అనే యువకుడు తెలిపాడు. బిర్యానీ తిన్న తర్వాత ఫుడ్ పాయిజనింగ్ వల్లనే వాంతులు విరేచనాలు అయ్యాయని పేర్కొన్నాడు. ఎక్స్ వేదికగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు కంప్లైంట్ చేశాడు. స్పందించిన అధికారులు గ్రీన్ బావర్చి రెస్టారెంట్లో తనిఖీలు చేపట్టారు. సింథటిక్ ఫుడ్ కలర్స్ ను సీజ్ చేశారు. రెస్టారెంట్ లో శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు తరలించినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.

READ MORE:Mechanic Rocky : పెయిడ్ ప్రీమియర్స్ ఉన్నాయ్.. మెకానిక్ రాకీ పై అదంతా ఉత్తిదే

ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో కల్తీ ఆహారం పెరుగుతోంది. ఆహార కల్తీ వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కల్తీ ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరానికి హానీకరం. కల్తీ ఆహార పదార్థాల్లో హానీకరమైన రంగులు, రసాయనాలు వాడడం వల్ల ప్రాణాంతక కేన్సర్‌కు కారణమవుతున్నాయి. మరికొన్ని కల్తీ ఆహార పదార్థాల వల్ల గుండె, మూత్రపిండాలు, కాలేయం పాడై ప్రాణాంతకంగా మారుతోంది. కల్తీ వల్ల విరేచనాలు, కడుపునొప్పి, కీళ్ల నొప్పులు వస్తున్నాయి. కొన్ని కల్తీ ఆహార పదార్థాల వల్ల మెదడు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కల్తీ ఆహార పదార్థాలను ఆకర్షణీయంగా, రుచిగా తయారు చేయడానికి ఎన్నో రసాయనాలను కలుపుతున్నారు. ఆహార పదార్థాల్లో అల్యూమినియం, పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల మెదడు, ఎముకలు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు. అందరూ జాగ్రత్తలు వహించాలి.

READ MORE:Roger Federer: నీ కారణంగానే ఆటను మరింత ఆస్వాదించా.. ఫెదరర్‌ భావోద్వేగ లేఖ!