Site icon NTV Telugu

Kongala WaterFalls: సెల్ఫీ తీసిన ప్రాణం.. కొంగాల జలపాతంలో పడి యువకుడు గల్లంతు

Kongala Water Fall

Kongala Water Fall

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలపాతాలు సైతం ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. జలసవ్వడులు వింటూ సేదతీరేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. అయితే అజాగ్రత్త కారణంగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలంలోని కొంగాల జలపాతం వద్ద విషాదం చోటుచేసుకుంది. జలపాతంలో పడి యువకుడు గల్లంతయ్యాడు. సెల్ఫీ తీసుకోడానికి జలపాతం దగ్గర కి వెళ్లి జారీ పడి యువకుడు మృతి చెందాడు.

Also Read:Venkatesh : వెంకీ–త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. ఎవరో తెలుసా?”

గల్లంతు అయినా యువకుడు మహాశ్విన్ హైదరాబాద్ ఉప్పల్ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అనుమతి లేకున్నా ఉదయాన్నే జలపాతం వద్దకు వెళ్లారు 8 మంది స్నేహితులు.. ఈ క్రమంలో ప్రమాదబారిన పడ్డాడు. దుసలపాటి జలపాతం వద్ద గల్లంతయిన యువకుడి కోసం రెస్క్యూ టీంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. యువకుడు గల్లంతవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Exit mobile version