Site icon NTV Telugu

Skill University: సింగపూర్‌లో సీఎం రేవంత్ పర్యటన.. ఐటీఈతో యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ ఒప్పందం!

Skill University Ite

Skill University Ite

నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ.. సింగపూర్ ప్రభుత్వ ఆధీనంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) సంస్థతో ఎంఓయు కుదుర్చుకుంది. సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి శ్రీధర్‌ బాబు, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్‌ల సమక్షంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు, ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ ఈరోజు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

సింగపూర్ ఐటీఈ పదో తరగతి చదివే విద్యార్ధుల స్థాయి నుంచి చదువు పూర్తి చేసిన యువత, ఆసక్తి ఉన్న ఏ వయసు వారికైనా.. పరిశ్రమలు, ఐటీ సంస్థల సహకారంతో జాబ్ రెడీ శిక్షణను ఇస్తుంది. ‘స్కిల్స్ ఫర్ ఫూచర్, స్కిల్స్ ఫర్ లైఫ్’ అనే నినాదంతో పనిచేస్తున్న ఐటీఈలో ప్రస్తుతం 28 వేల మంది శిక్షణ పొందుతున్నారు. మొత్తం వంద ఫుల్ టైమ్ కోర్సులకు ఆన్‌లైన్, క్యాంపస్ శిక్షణ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఐటీఈకి ఐదు వేల పరిశ్రమలతో భాగస్వామ్యం ఉంది.

Also Read: Ration Cards: పాత రేషన్ కార్డులు తొలగించడం లేదు.. తప్పుడు ప్రచారంను నమ్మొద్దు: మంత్రి పొన్నం

పరిశ్రమలు తమకు అవసరమైన మానవ వనరులకు ఐటీఈలో నేరుగా శిక్షణనిచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. అదే స్పూర్తితో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన యుంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తన శిక్షకులకు ఐటీఈతో ట్రెయినింగ్ (ట్రెయినింగ్ ఫర్ ట్రెయినర్స్) ఇప్పించేలా ఒప్పందరం కుదుర్చుకుంది. తాజా ఎంఓయు వల్ల సింగపూర్ ఐటీఈ పాఠ్యాంశాలను మనం ఉపయోగించుకునే వీలు కలుగుతుంది.

Exit mobile version