Site icon NTV Telugu

Young Directors : హిట్ ఇచ్చినా కూడా ఖాళీగా ఉన్న యువ దర్శకులు

Kollywood

Kollywood

మణిరత్నం, శంకర్, గౌతమ్ వాస్ దేవ్ మీనన్ బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా ఫెయిలవుతున్నారు. కాస్తో కూస్తో లోకేశ్, నెల్సన్, వెట్రిమారన్ తమిళ ఇండస్ట్రీని నిలబెట్టే బాధ్యతను తీసుకుంటున్నారు. డైనమిక్ దర్శకుల కొరత తమిళ ఇండస్ట్రీలో కొరవడుతున్న టైంలో యంగ్ డైరెక్టర్ల విప్లవం స్టార్టైంది. అరుణ్ మాథేశ్వరన్, అశ్వత్ మారిముత్తు లాంటి వర్సటైల్ డైరెక్టర్స్ పుట్టుకొచ్చారు. వీరితో పాటు మరికొంత మంది న్యూ కమ్మర్స్ కూడా తోలి సినిమాతో ఫ్రూవ్ చేసుకున్నారు. కానీ రెండవ సినిమా కోసం పడిగాపులు కాస్తున్నారు.

Also Read : Coolie : కూలీ ఓవర్సీస్ రివ్యూ..

ఈ ఏడాది జాతీయ చలన చిత్ర అవార్డును దక్కించుకున్న తమిళ ఫిల్మ్ పార్కింగ్. రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకుడు. అతడి టాలెంట్ గుర్తించి శింబు ఛాన్స్ ఇచ్చాడు.. కానీ సడెన్లీ మధ్యలోకి వెట్రీ రాకతో శింబు 49 పోస్ట్ పోన్ అయ్యింది. అలాగే లబ్బర్ పందుతో మంచి విజయాన్ని నమోదు చేసిన తమిళరసన్ పచ్చముత్తు నెక్ట్స్ సినిమా కోసం కథ రెడీ చేసుకుని ధనుష్ కాల్సీట్లు కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ధనుష్ ఫుల్ బిజీ. మహారాజాతో విజయ్ సేతుపతి ఖాతాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ఇచ్చిన నితిలన్ స్వామినాథన్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇంతే. నయనతార, రజనీకాంత్‌తో సినిమాలన్న వార్తలే కానీ ఏదీ స్టార్టైన దాఖలాలు లేవు. ఇక రీసెంట్ హిట్ టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు అభిషన్ జీవంత్ హీరోగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. వీళ్లే కాదు ఈ జాబితాలో మరికొంత మంది ఫ్రూవ్డ్ డైరెక్టర్స్ ఉన్నారు. వీరంతా కథలు లేక కాదు స్టార్ హీరోల కోసం వెయిట్ చేస్తూ కాలయాపన చేస్తున్నారు. టాలెంట్ యువ దర్శకులున్నా సరిగ్గా వినియోగించుకోవడంలో తడబడుతోంది కోలీవుడ్. మరీ ఈ బాలారిష్టాలను ఈ డైరెక్టర్స్ ఎప్పుడు అధిగమిస్తారో.

Exit mobile version