Site icon NTV Telugu

Viral Video : ఫన్నీ రోడ్ యాక్సిడెంట్.. వైరల్ అవుతున్న వీడియో..!

Viral Boy

Viral Boy

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాను ఉపయోగించేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోయింది. ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే దాన్ని నెట్టింట షేర్ చేస్తున్నారు. అలా అవి కాస్త నెటిజన్ల కంట పడగానే వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఓ పిల్లవాడికి జరిగిన ఫన్నీ రోడ్ యాక్సిడెంట్‌ వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ చిన్నారికి జరిగిన యాక్సిడెంట్‌ని చూసి నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు. దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Kuna Ravikumar: మంత్రి అప్పలరాజు మైనింగ్ దోపిడీ ఆపాలి

ఈ వీడియోలో ఓ చిన్న పిల్లవాడు తన కారు బొమ్మతో నేలపై ఆడుకుంటూ ఉంటాడు. అలా ఆడుకుంటూ దాన్ని స్పీడ్‌గా నేలపై నడుపుతూ ఉండగా.. ఎదురు రాయి తగులుతుంది. అప్పుడు కార్‌కి ఏం కాదు కానీ ఆ పిల్లవాడు ఒక్కసారిగా ( తలకిందకు కాళ్లు పైకి లేస్తాయి ) శీర్షాసనం కోసం లేచినట్లుగా ముందుకు పడతాడు. ఇక దీనికి సంబంధించన విజువల్స్ తన కెమెరాలో బంధించిన వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది అలా వైరల్ అవుతూ అవుతూ తాజాగా _smiles4miles___ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నుంచి కూడా షేర్ అయింది.

Also Read : Priyanka Gandhi: రాహుల్ గాంధీని చూసి నేర్చుకోండి.. ప్రధాని మోడీకి సలహా..

ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు పిచ్చపిచ్చగా నవ్వేసుకుంటున్నారు. ఈ వీడియోపై విభిన్నంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘డ్రైవింగ్ మూడ్‌లో ఉన్నప్పుడు ఇట్లాంటి యాక్సిడెంట్స్ జరగడం సహజం.. తగ్గేదేలే..’ అంటూ రాసుకొచ్చారు. ఇంకొకరు ‘కార్‌కి ఇన్స్యూరెన్స్ ఉందా లేదా..?’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అలాగే మరో నెటిజన్ ‘యాక్సిడెంట్ అయితే వెంటనే అంబులెన్స్‌కి కాల్ చేయాలి కానీ అలా నవ్వరు’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 2 లక్షల 2 వేల లైకులు, 20 లక్షల మంది ఈ వీడియోను చూశారు.

Exit mobile version