Pawan Kalyan: ‘నా అన్నయ్యే నా ఏకైక హీరో’.. ‘చిరు’ పుట్టినరోజున తమ్ముడు ఎమోషనల్ పోస్ట్..!
- చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా..
- పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్..
- చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ..
- అన్నయ్య చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్న పవన్ కళ్యాణ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన తమ్ముడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. అన్నయ్యతో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. తన జీవితంపై చిరంజీవి చూపిన ప్రభావం, ఆయన చేసిన త్యాగాలు, కుటుంబంపై చూపిన ప్రేమను పవన్ కళ్యాణ్ తన పోస్టులో వివరించారు. చిరంజీవి తనకు హీరోగా మారకముందే.. హీరో అని పేర్కొంటూ అన్నయ్యపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
చిరంజీవి కాలేజీ చదువుల కోసం నర్సాపూర్ వెళ్లిన రోజులను పవన్ కళ్యాణ్ గుర్తుచేసుకున్నారు. వేసవి సెలవులకు అన్నయ్య ఇంటికి తిరిగి వస్తే తమ ఇంట్లో పండుగ వాతావరణం ఉండేదని, అలాగే ఆయన తిరిగి కాలేజీకి వెళ్లినప్పుడు మాత్రం ఇంట్లో విషాదం, వెలితి కనిపించేదని.. ఆయన లేకపోతే ఇల్లు కళ తప్పినట్లుగా అనిపించేదని రాసుకొచ్చారు. తాను స్కూల్లో చదువుకునే రోజుల్లో చిరంజీవి పక్కన నడవడమే తనకు ఎంతో గర్వంగా ఉండేదని పవన్ తెలిపారు. కాలేజీలో చదువుతున్నప్పుడే చిరంజీవి తనకు ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా కనిపించేవారని అన్నారు. తండ్రి బుల్లెట్ బైక్‌పై చిరంజీవి పొడవాటి జుట్టు, ఫిట్‌గా ఉన్న ఎన్సీసీ క్యాడెట్ శరీరాకృతి, బెల్ బాటమ్స్, కళ్లద్దాలతో కనిపిస్తే తాను ఫ్యాన్‌బాయ్‌లా భావించేవాడినని గుర్తుచేశారు.
Also Read
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
- Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
చిరంజీవి సినీ కెరీర్ ప్రారంభ దశలో తొలిసారి సింగపూర్ వెళ్లి వచ్చినప్పుడు పెద్ద నీలిరంగు బ్యాగ్ తీసుకొచ్చారని పవన్ గుర్తుచేసుకున్నారు. అందులో తన కోసం చిన్న లెగో హెలికాప్టర్, రిమోట్ కార్లు, రేసింగ్ ట్రాక్, కామిక్స్, మ్యూజిక్ క్యాసెట్లు, టేప్ రికార్డర్, యార్డ్లీ పౌడర్లు, సబ్బులు, పెర్ఫ్యూమ్స్తో పాటు కుటుంబ సభ్యుల కోసం చిన్నచిన్న బహుమతులు ఉన్నాయని తెలిపారు. చిరంజీవి తమ చిన్న ఇంట్లో ఎప్పుడూ ఆనందాన్ని, చిరునవ్వులను నింపేవారని పవన్ పేర్కొన్నారు
పెళ్లి చేసుకున్న సమయంలో అన్నయ్య తమకు దూరమైపోతారేమోనని తాను బాధపడ్డానని పవన్ తెలిపారు. ఓ గదిలో ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న సమయంలో అన్నయ్య భార్య సురేఖను తీసుకొచ్చి.. “రా.. ఈరోజు నీకు ఒక పెద్ద మనిషిని పరిచయం చేస్తాను” అని చెప్పారని గుర్తుచేసుకున్నారు. అప్పుడు చిరంజీవి, సురేఖ ఇద్దరూ నవ్వుతూ తన కన్నీళ్లకు కారణం తెలుసుకున్నారని పవన్ రాసుకొచ్చారు. ఆ తర్వాత తాను చెన్నైలో చిరంజీవి, సురేఖతో కలిసి ఉన్న రోజులను కూడా పవన్ గుర్తుచేసుకున్నారు. తనపై వారిద్దరూ చూపించిన ప్రేమ, శ్రద్ధను మాటల్లో చెప్పడానికి సరిపడా పదాలు లేవని పేర్కొన్నారు.
అలాగే అన్నయ్య సినీ కెరీర్లో ఎదుర్కొన్న కష్టాలను తాను దగ్గరుండి చూశానని పవన్ తెలిపారు. చెన్నైలోని వేడి, ఉక్కపోత మధ్య రోజుకు దాదాపు 18 గంటల పాటు షూటింగ్స్‌లో శ్రమించి, చెమటతో తడిసిన దుస్తులు, షూస్‌తో అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చేవారని గుర్తుచేసుకున్నారు. నిలబడేందుకు కూడా శక్తి లేని స్థితిలో ఇంటికి వచ్చినప్పటికీ.. తన చదువులో వైఫల్యాలు, జీవితంలో సరైన దిశ లేకపోవడం గురించి చిరంజీవి తనను ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదని పవన్ వెల్లడించారు. అన్నయ్య తన కుటుంబాన్ని మాత్రమే కాకుండా బంధువులు, స్నేహితులు, నిర్మాతలు, సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరినీ తన ఔదార్యంతో ఆదుకున్నారని పవన్ కొనియాడారు.
చిరంజీవి దక్షిణాది, హిందీ చిత్ర పరిశ్రమల మధ్య సాంస్కృతిక వారధిగా వ్యవహరించిన ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరని పవన్ పేర్కొన్నారు. భారతీయ సినిమాపై చిరంజీవికి ఎప్పుడూ ఎంతో నమ్మకం ఉండేదని తెలిపారు. హిందీలో ‘ప్రతిబంధ్’, ‘ఆజ్ కా గూండారాజ్’ వంటి చిత్రాలతో ఆయన విజయాలు సాధించిన విషయాన్ని గుర్తుచేశారు. టెక్నాలజీపై అవగాహన, వైద్య పరిజ్ఞానం, సేవా కార్యక్రమాలు, కుటుంబ విలువలు, సూపర్‌స్టార్ నుంచి మెగాస్టార్‌గా ఎదిగిన ప్రయాణం, కేంద్ర మంత్రిగా బాధ్యతలు, జాతీయ పురస్కారాలు, పద్మ విభూషణ్ వంటి ఎన్నో ఘనతలను పవన్ తన పోస్టులో ప్రస్తావించారు.
ఇటీవల వెన్నెముకకు పెద్ద శస్త్రచికిత్స జరిగినప్పటికీ చిరంజీవి ఎంతో త్వరగా కోలుకుని స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తూ తిరిగి పనిలోకి వచ్చారని పవన్ తెలిపారు. “ఒక నగరం ఎప్పుడూ నిద్రపోనట్లే.. ఆయన ఎప్పుడూ విశ్రాంతి తీసుకోరు” అంటూ అన్నయ్య పట్టుదలను వివరించారు. చిరంజీవి అంతర్గతంగా ఎప్పుడూ ఆగని శక్తితో పుట్టారని.. అందుకే ఆయన కోట్లాది మంది అభిమానించే ‘మెగాస్టార్’గా, తనకు మాత్రం ఏకైక హీరోగా నిలిచారని పవన్ కళ్యాణ్ భావోద్వేగంగా పేర్కొన్నారు.
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రకృతి ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, అపారమైన శక్తి, జీవితంలో మరెన్నో విజయాలు అందించాలని పవన్ ఆకాంక్షించారు. అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం కేవలం ఒక సంప్రదాయం కాదని.. తనలాంటి ఎంతోమంది జీవితాలను ఆయన ఎలా ప్రభావితం చేశారో గుర్తుచేసుకునే సందర్భమని పేర్కొన్నారు. భారతదేశ భవిష్యత్తును మరింత బలంగా నిర్మించేందుకు ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిందని చెబుతూ.. “జై హింద్” అంటూ తన ఎమోషనల్ పోస్టును ముగించారు.
A thought about Annaya @KChiruTweets is always a source of joy. While I walk along the memory lane on this special day ,these are few memories I have tumbled upon.
In our childhood, he went away from home to pursue his college education in Narsapur. And his homecoming for… pic.twitter.com/oWMPairQY1
— Pawan Kalyan (@PawanKalyan) August 22, 2026
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?