NTV Telugu Site icon

Yuvraj Singh Father: నా కొడుకు కెరీర్‌ను నాశనం చేశాడు.. ధోనీపై తీవ్ర ఆరోపణలు

Yuvi

Yuvi

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్‌ ఆరోపణలు గుప్పించారు. తన కొడుకు కెరీర్‌ను ధోనీనే నాశనం చేశాడంటూ మండిపడ్డారు. కాగా.. గతంలో కూడా పలుమార్లు ధోనీపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా మరోసారి కామెంట్స్ చేశారు. ధోని తన కొడుకు కెరీర్‌ను నాశనం చేశాడని తెలిపాడు. క్యాన్సర్‌తో పోరాడి భారత జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడని.. యువరాజ్‌కు భారతరత్న ఇవ్వాలని యోగరాజ్‌ కోరాడు. కాగా.. ఎంఎస్ ధోని కెప్టెన్సీలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Read Also: JP Nadda: మాలీవుడ్ లైంగిక వేధింపుల రిపోర్ట్‌పై కేరళ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జేపీ నడ్డా..

యోగరాజ్ మాట్లాడుతూ.. “యువరాజ్ సింగ్ కెరీర్‌ను నాశనం చేసినందుకు ఎంఎస్ ధోనీని నేను క్షమించను. ధోని అద్దంలో చూసుకోవాలని నా అభిప్రాయం. అతను చాలా పెద్ద క్రికెటర్, అయితే నా కొడుకుపై వ్యతిరేకత ఉంది. నాకు వ్యతిరేకంగా మారిన ఎవరినీ నేను క్షమించలేదు. అది నా కుటుంబ సభ్యులు కూడా కావచ్చు, ”అని యోగరాజ్ సింగ్ తెలిపారు. “యువరాజ్ మరో నాలుగైదు సంవత్సరాలు ఆడేవాడు.. కానీ ఎంఎస్ ధోని నా కొడుకుకు మద్దతు ఇవ్వలేదు. గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ కూడా యువరాజు జట్టులోకి రాడని అన్నారు. క్యాన్సర్‌తో బాధపడుతూనే దేశం కోసం ఆడి.. ప్రపంచకప్‌ గెలిచినందుకు భారత ప్రభుత్వం యువరాజ్ కు భారతరత్న రావాలి’ అని యోగరాజ్ సింగ్ అన్నారు.

Read Also: Krishna River: ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణా.. అధికారులు అలర్ట్

కాగా.. యువరాజ్ సింగ్ భారత జాతీయ క్రికెట్ జట్టుకు 402 అంతర్జాతీయ ఆటలలో ప్రాతినిధ్యం వహించాడు. అందులో.. 11,178 పరుగులు చేశాడు. అతను అన్ని ఫార్మాట్లలో కలిపి 17 సెంచరీలు, 71 హాఫ్ సెంచరీలు సాధించాడు.

Show comments