NTV Telugu Site icon

Yogi Adityanath: కాశీ విశ్వనాథుడిని 100 సార్లు దర్శించుకున్న తొలి సీఎం యోగి

Yogi Adityanath

Yogi Adityanath

Yogi Adityanath: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం ఉదయం కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రార్థనలు చేశారు. గత ఆరేళ్లలో 100వ సారి ఆలయాన్ని సందర్శించిన ఉత్తరప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి అయ్యారని అధికారిక ప్రకటన తెలిపింది. సీఎం యోగి 2017లో అధికారం చేపట్టినప్పటి నుంచి సగటున ప్రతి 21 రోజులకోసారి ఆలయానికి వచ్చి విశ్వనాథుడిని ఆరాధించడంతోపాటు రాష్ట్ర, దేశ ప్రజల సంక్షేమం కోసం ‘షోడశోపచార’ పద్ధతిలో ప్రార్థిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం యోగి శుక్రవారం 113వ సారి వారణాసికి వచ్చారు.

సీఎం యోగి కనీసం నెలకు ఒకసారి కాశీని సందర్శిస్తారు. ప్రతి పర్యటనలో నగరంలో అభివృద్ధి పనులపై సమీక్షలు, క్షేత్ర పరిశీలనలు నిర్వహిస్తారు. యోగి ఆదిత్యనాథ్ మొదటిసారి ఉత్తరప్రదేశ్‌కు బాధ్యతలు స్వీకరించిన తర్వాత, 2017 నుండి మార్చి 2022 వరకు 74 సార్లు విశేశ్వరుడిని దర్శించి ఆశీస్సులు పొందారు. సనాతన ధర్మం పట్ల, బాబా విశ్వనాథ్ పట్ల ఆయనకున్న అపారమైన భక్తికి సీఎం యోగి సందర్శనలే నిదర్శనమని కాశీ విశ్వనాథ్ ఆలయ పూజారి నీరజ్ కుమార్ పాండే అన్నారు.గత ఏడాది సెప్టెంబర్ 9న ముఖ్యమంత్రి 100వ సారి వారణాసిని సందర్శించినప్పుడు 88వ సారి శ్రీకాశీ విశ్వనాథ్ ధామ్‌ను సందర్శించారు. అప్పటి నుంచి మార్చి 18 వరకు ముఖ్యమంత్రి 12 సార్లు ఆలయాన్ని సందర్శించారు. సీఎం 100వ సారి కూడా కాలభైరవ ఆలయంలో ప్రార్థనలు చేశారు.

Read Also: World’s Shortest Bodybuilder: ప్రపంచంలోనే అత్యంత పొట్టి బాడీబిల్డర్‌.. ఓ ఇంటివాడయ్యాడు..

సీఎం యోగి శ్రీకాశీ విశ్వనాథ ఆలయంలో 100 సార్లు పూజలు చేసి చరిత్ర సృష్టించడమే కాకుండా గత ఆరేళ్లలో 100 సార్లు కాలభైరవ ఆలయాన్ని సందర్శించిన మొదటి ముఖ్యమంత్రిగా కూడా నిలిచారు.కాలభైరవుడిని ‘కాశీ కొత్వాల్’ అని పిలుస్తారు. శనివారం ఉదయం ముఖ్యమంత్రి ఆలయంలో పూజలు చేసి ‘ఆరతి’ నిర్వహించారు. గుడి బయట ‘డమ్రు’ వాయించే బాలుడితో కూడా మాట్లాడి అతని చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా రెండో రోజు శనివారం కూడా సీఎం యోగి కొత్తగా నిర్మించిన సర్క్యూట్‌ హౌస్‌ భవనాన్ని పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం వారణాసి చేరుకున్న సీఎం యోగి అక్కడి అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు మార్గదర్శకాలు అందించారు. కార్ఖియాన్వ్‌లోని ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్, 34వ కార్ప్స్ పీఏసీ, రోహనియా పోలీస్ స్టేషన్‌లో నిర్మించిన బ్యారక్‌లను కూడా సీఎం పరిశీలించి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.